హిట్.. ఓ డిఫరెంట్ థ్రిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వక్సేన్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ‘హిట్’ సినిమా నేడు థియేటర్లకు వస్తోంది. వాల్‌పోస్టర్ బ్యానర్‌పై హీరో నాని నిర్మించిన సినిమా ఇది. గురువారం హైదరాబాద్‌లో చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. కార్యక్రమంలో నిర్మాత నాని మాట్లాడుతూ -నన్ను పరిశ్రమ నిలబెట్టింది. అందుకే వాల్‌పోస్టర్ బ్యానర్‌పై పరిశ్రమకు ఏదైనా చేయాలనిపించి నిర్మాతగా మారాను. ‘హిట్’ ఓ మంచి థ్రిల్లర్ అని నమ్మకంగా చెబుతున్నా. పండుగలాంటి సీజన్ ఏమీ లేకున్నా సినిమా బాగా ఆడుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ‘హిట్’ మంచి కథ అయినా నేను చేయకపోవడానికి కారణం -నిర్మాతగా కథను విన్నాను కనుక నిర్మాతగానే సినిమా రూపొందించాను. నిజానికి ఇదొక యునీక్ కంటెంట్. ఏదైనా హత్య జరగబోతోందని ఊహించి ముందుగా అలెర్ట్ అయ్యే టీం -హిట్. సినిమా చూశాక మీకే తెలుస్తుంది. ఇండస్ట్రీకి మంచి దర్శకులను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నా. ఈ విషయంలో శైలేష్ నా నమ్మకాన్ని నిలబెట్టాడనే అనిపించింది. ఇక హీరో విశ్వక్సేన్ గురించి ఇప్పుడేం మాట్లాడను. మాట్లాడే టైం మళ్లీ వస్తుంది. అప్పుడు చెబుతా అన్నాడు. కార్యక్రమంలో హీరో విశ్వక్సేన్, నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు శైలేష్ కొలను మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ సినిమా విశేషాలు చెప్పుకొచ్చారు.