సెట్స్‌పైకి.. కిరణ్ అబ్బవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజావారు రాణీవారు చిత్రంతో మంచి పెర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం రెండో సినిమా మొదలుపెట్టాడు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ప్రాజెక్టు మార్చి 2నుంచి సెట్స్‌పైకి వెళ్తోంది. టాక్సీవాలాతో ఆడియన్స్‌ని మెప్పించిన ప్రియాంక జువాల్కర్ ఈ ప్రాజెక్టులో కిరణ్‌తో రొమాన్స్ చేయనుంది. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. శ్రీధర్ గడె దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ప్రాజెక్టులో సాయికుమార్ ముఖ్య పాత్ర పోషించనున్నాడు. స్టైలిష్ కథను అద్భుతంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేశామని నిర్మాతలు వెల్లడించారు.