వరుణ్‌తో.. తలపడతాడట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల రాక్షసితో మంచి పెర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్నాడు నవీన్‌చంద్ర. తర్వాత చిన్నా చితకా హీరో పాత్రలు చేస్తూనే -క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా సినిమాలు చేశాడు. కొత్తతరం విలన్లను టాలీవుడ్ వెతుకుతున్న టైంలో -నవీన్‌చంద్రకు మంచి చాన్స్‌లే వచ్చాయి. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అరవిందసమేత’లో విలన్ బసిరెడ్డి కొడుకుగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నవీన్‌చంద్ర -ఆమధ్య ఓ తమిళ స్టార్ హీరో చిత్రంలోనూ విలన్ రోల్ పోషించి ఓకే అనిపించుకున్నాడు. తాజాగా వరుణ్ సందేశ్‌కు ప్రతి పాత్రలో నవీన్‌ను చూపించేందుకు దర్శకుడు కిరణ్ కొర్రపాటి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వరుణ్‌తేజ్‌తో ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి బాక్సింగ్ నేపథ్యంలో కథ చేస్తుండటం తెలిసిందే. ఈ కథ కోసం పర్ఫెక్ట్ బాక్సర్‌గా కనిపించేందుకు వరుణ్‌తేజ్ కొంతకాలం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆహార్యంలోనూ, పెర్ఫార్మెన్స్‌లోనూ వరుణ్‌కు నవీన్ సమవుజ్జీలా ఉంటాడన్న ఆలోచనతో -ప్రతినాయక పాత్ర కోసం నవీన్‌చంద్రను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు నవీన్ మంచి బాక్సర్ కావడం కలిసొచ్చే విషయంగా చిత్రబృందం ఆలోచిస్తోందట. స్క్రీన్ టెస్ట్‌లు కూడా పూర్తవ్వడంతో -ప్రాజెక్టులో నీవీన్‌కు విలనీ బెర్త్ కన్ఫర్మ్ అంటున్నారు. జూలై 30న సినిమాను థియేటర్లకు తెచ్చే ఆలోచన ఉంది కనుక, తదుపరి షెడ్యూల్స్‌లోనే నవీన్ బోర్డ్‌లోకి రావొచ్చు. ఈ సినిమాలో వరుణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కైదా అద్వానీ కనిపించనుంది.