పేల్చిందిగా.. వైజయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాస్‌తో నాగ్‌అశ్విన్ సినిమా
‘మహానటి’ బయోపిక్‌తో సెనే్సషన్ క్రియేట్ చేసిన నాగ్‌అశ్విన్ -మరో భారీ ప్రయత్నంలో నిమగ్నమయ్యాడంటూ కొంతకాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దానిపైనే వైజయంతి మూవీస్ గురువారం బిగ్ అనౌన్స్‌మెంట్‌గా పేల్చింది. దశాబ్దాల చరిత్ర కలిగిన వైజయంతి మూవీస్ -అనూహ్యమైన కాంబోతో ప్రాజెక్టు ప్రకటించటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్కైంది. సావిత్రిని ‘మహానటి’ అని ఎందుకంటారో కళ్లకు కట్టినట్టు చూపించిన అవార్డు విన్నింగ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ప్రాజెక్టును ప్రకటించింది వైజయంతి మూవీస్. పదిహేనొవ శతాబ్దనాటి పీరియాడికల్ స్టోరీని నాగ్ అశ్విన్ అధ్యయనం చేస్తున్నాడంటూ కొంతకాలంగా వినిపిస్తోంది. ఏదోకరోజు దీనిపై వైజయంతి నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ రావొచ్చన్నదీ వింటున్నదే. గురువారం అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి వైజయంతి ఈ అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే -నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో భారీ సైన్స్‌ఫిక్షన్ సినిమా చేసే ఆలోచన ఉన్నట్టూ గతంలో వైజయంతి మూవీస్ నుంచి వినిపించిన మాట. భారీ ప్రాజెక్టుపై బిగ్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది కానీ, పీరియాడికల్ చిత్రమా? సైన్స్ ఫిక్షనా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. జోనర్ ఏదైనా ప్రభాస్‌తో సినిమా కనుక -పాన్ ఇండియా తరహాలోనే ఉండే అవకాశం లేకపోలేదు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్‌స్టోరీలో చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. యూవీ క్రియేషన్ నిర్మిస్తోన్న ప్రాజెక్టు ఇది. దీని తరువాత వెంటనే ప్రభాస్ పీరియాడికల్ మూవీ చేస్తాడా? అన్నది ఒకింత సదేహమే. ఏదేమైనా వైజయంతి మూవీస్ నుంచి తదుపరి అప్‌డేట్స్ వచ్చేవరకూ -చిత్రవిచిత్రమైన కథనాలు ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటాయి.