4x4 ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశాంత్, ప్రియాంక జంటగా అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్ పతాకంపై శివ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం 4x4. ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు సన్నివేశానికి తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్‌నివ్వగా, సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు శివ మాట్లాడుతూ, నలుగురు స్నేహితుల జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని చెప్పారు. కథ నచ్చి ఈ సినిమాను చేయడానికి ముందుకు వచ్చామని, యువతకు బాగా నచ్చే కథాంశంతోపాటుగా ప్రేమకథలో ప్రతి సన్నివేశం సరికొత్తగా వుంటుందని హీరో ప్రశాంత్ తెలిపారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు నిహాల్, కోలా భాస్కర్, ధన్‌రాజ్, వేణు, రాకేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా:నాని చెమిడిశెట్టి, మాటలు:క్రాంతి సకినాల, సంగీతం:నిహాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ (అపురూప్).