AADIVAVRAM - Others

సరెండర్ (ఓ చిన్నమాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవు. మన జీవితంలోని సంఘటనలు మనం అనుకున్నట్టుగా జరగవు. చాలా విషయాలు మన నియంత్రణలో ఉండవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకూలించవు చాలాసార్లు.
అందుకని కొన్నిసార్లు వచ్చిన స్థితిని వచ్చినట్టు స్వీకరించాలి. అయితే మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. అలా స్వీకరించనప్పుడు మన మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది.
పూర్తిగా మనం ఎదురయ్యే పరిస్థితులకి, మరో రకంగా చెప్పాలంటే భగవంతుడికి సరెండర్ కావాలి. అంటే జీవితంలో వచ్చే పరిస్థితులని వచ్చినట్టు స్వీకరించాలి. అప్పుడు ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. జీవితం మరీ కష్టంగా అనిపించదు.
క్లిష్ట సమయంలో, సమస్యలు ఎదురైనప్పుడు కొంత రిలాక్స్ కావాలి. అప్పుడు మనకు ఏదో ఒకదారి దొరుకుతుంది. మన మెదడు మంచిగా ఆలోచిస్తుంది.
మన సమస్యలకి మనం నెగెటివ్ శక్తిని ఇస్తూ ఉంటాం. అలా కాకుండా ఆశావాహంగా ఆలోచిస్తే మంచిది.
అతిగా ఊహించుకోకూడదు. ఫలితం ఎలా ఉన్నా ఏదో జరుగుతుందని అతిగా ఆశించకూడదు. అప్పుడు అంత బాధ ఉండదు. వేదన ఉండదు. అప్పుడే ఒత్తిడి తగ్గుతుంది. బాధ కూడా తగ్గుతుంది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001