మరిపిస్తుందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడు దివంగత సీఎం జయలలిత 72వ జయంతి సందర్భంగా ‘తలైవి’నుంచి కంగన కొత్త లుక్ వదిలారు. దర్శకుడు ఎఎల్ విజయ్ తెరకెక్కిస్తోన్న జయ బయోపిక్‌లో కంగనారనౌత్ లీడ్‌రోల్ చేస్తుండటం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన కంగన లుక్‌లో -30ఏళ్ల క్రితం జయలలిత వర్చస్సు కనిపిస్తోంది. నలుపు ఎరుపు బార్డర్‌తో వున్న తెల్లని చీరలో జయలలితగా కంగన లుక్ ఆసక్తి కలిగిస్తోంది. సినిమా కెరీర్‌ని ముగించి రాజకీయాల్లోకి వచ్చిన సమయం నాటి జయలలిత జీవిత ఘట్టాలను తెరపై చూపించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో విడుదల చేసిన కటౌట్ లుక్‌పై విమర్శలు రావడంతో, చిత్రబృందం ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్టే కనిపిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న చిత్రంలో ఎంజీఆర్‌గా అరవిందస్వామి, శోభన్‌బాబుగా జిషుసేన్ గుప్తా, కరుణానిధిగా ప్రకాష్‌రాజ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. జూన్ 26న ‘తలైవి’ థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది.