28న స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వేచ్ఛ ఉంటేనే ఆడపిల్లలు ఏ రంగంలోనైనా రాణిస్తారని కథానాయిక, గాయని మంగ్లీ అన్నారు. రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో ‘స్వేచ్ఛ’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్మాత రాజునాయక్, సంగీత దర్శకుడు భోలే పాల్గొన్నారు. మంగ్లీ మాట్లాడుతూ -పోస్టర్‌లో నేను కనిపించటం లేదు. సీతాకోకచిలుకే కనిపిస్తోంది. అంతందగా డిజైన్ చేశారు. ఆడపిల్లలకు స్వేచ్ఛనిస్తేనే వాళ్లు ఎంచుకునే రంగాల్లో రాణించగలుగుతారు. దర్శకుడు స్ఫూర్తినిచ్చే సినిమా చేశాడు. సొసైటీకి ఉపయోగపడే సినిమా కోసం అంతా కష్టపడ్డారు. ఒక అమ్మాయిని వాళ్ల నాన్న అమ్మేస్తే -బాగా చదువుకుని వచ్చి ఆ ఊరినే బాగుచేస్తుంది. ఇంత మంచి కథాంశానికి బోలే మంచి సంగీతం సమకూర్చాడు. 28న విడుదల కానున్న చిత్రాన్ని అంతా ఆదరించాలని కోరుతున్నా అన్నారు. నిర్మాత రాజునాయక్ మాట్లాడుతూ -గోర్ జీవన్ పేరిట బంజారా భాషలో విడుదలైన సినిమా మంచి విజయం సాధించింది. అందుకే తెలుగులోనూ సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు. సంగీత దర్శకుడు బోలే మాట్లాడుతూ -మంగ్లీ ఇంతస్థాయికి ఎదిగి ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్న రాజునాయక్‌కు కృతజ్ఞతలు. మహిళల స్వేచ్ఛ గురించి ప్రస్తావించిన చిత్రాన్ని అంతా ఆదరించాలని కోరుతున్నా అన్నారు.