సెట్స్‌పైకి భాగమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా హీరోలకు ధీటుగా సత్తాను చాటుకుంటూ మరోవైపు గ్లామర్ హీరోయిన్‌గా తన హవాను కొనసాగిస్తోంది అందాల భామ అనుష్క. ప్రస్తుతం ‘బాహుబలి-2’ చిత్రంలో నటిస్తున్న ఈమె, మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘పిల్లజమిందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘్భగమతి’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమా చారిత్రక నేపథ్యంతో వుంటుందని వార్తలొస్తున్నాయి. మరోవైపు ఇది థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతుందని, చారిత్రాత్మక కథ కాదని కూడా అంటున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ హీరోగా నటిస్తాడట. యువి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఏదేమైనా స్టార్ ఇమేజ్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద తనదైన మార్కెట్‌ను స్వంతం చేసుకున్న అనుష్కతో ఈ తరహా చిత్రాలు చేయడానికి ఇప్పటికే చాలామంది దర్శక నిర్మాతలు వెయిట్ చేయడం విశేషం.