ఆ ప్రేమలో నిజమేవుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడాదిన్నర గ్యాప్ తరువాత ‘ భీష్మ’ టైటిల్‌తో వస్తున్నాడు హీరో నితిన్. ఈ సినిమాలో -యంగ్ సెనే్సషన్ రష్మిక మండన్న నితిన్‌తో రొమాన్స్ చూపించనుంది. ‘చలో’ ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న చిత్రం 21న థియేటర్లకు వస్తోంది. ప్రాజెక్టు ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హీరో నితిన్ మీడియాతో మాట్లాడాడు.
* భీష్మ కథ ఎలా..?
శ్రీనివాస కల్యాణం షూటింగ్ టైంలో వెంకీ కుడుముల ఓ లైన్ చెప్పాడు. అది నచ్చింది. అంతకుముందున్న అనుభవాల నేపథ్యంలో -స్ట్రిక్ట్‌గా స్క్రిప్ట్‌పై దృష్టిపెట్టాను. ఫుల్ బౌండ్ చేయడానికి కాస్త ఎక్కువ టైం తీసుకోక తప్పలేదు. అలా -నానుంచి సినిమా రావడానికి ఏడాది పైనే పట్టేసింది. అదే ఇప్పుడు ‘్భష్మ’గా వస్తోంది.
* సాగుపై పడ్డారేంటి?
ఆర్గానికి అగ్రికల్చర్ అన్నది లేయర్ మాత్రమే. ఆ లేయర్‌లో సాగే లవ్ స్టోరీయే అసలు సినిమా. లవ్, రొమాన్స్, కామెడీ ఇవే ఎక్కువ. సో, ఎంటర్‌టైనె్మంట్ మీదే నడుస్తుంది కనుక -ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నా.
* ఎలా వచ్చింది?
భీష్మ ప్రాజెక్టు మీద చాలా కన్ఫిడెంట్‌గా ఉన్నా. ఎలాంటి సినిమాలతో నితిన్‌కి పేరొచ్చిందో అలాంటి సినిమా. త్రివిక్రమ్‌లాంటి ఎక్స్‌పర్ట్స్ హిట్ అని సర్టిఫై చేసేశారు కనుక -మరింత ధైర్యంగా ఉన్నాను.
* రష్మికతో..?
స్క్రీన్‌పై రష్మిక అద్భుతంగా ఉంది. ఆమె మంచి నటి కూడా. మా ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇక ఈ మాట చెపాల్సింది ఆడియనే్స.
* డ్యాన్స్‌లు చేశారా?
చివరిగా గుండెజాలి గల్లతయ్యిందే చిత్రంలో నేను కాస్త ఎక్కువ డ్యాన్స్ చేశా. తరువాతి సినిమాల్లో చిన్న చిన్న స్టెప్పులు తప్ప పెద్దగా డ్యాన్స్ ఉండదు. ఈ ప్రాజెక్టుకు ముందే అనుకుని డ్యాన్స్‌పై ఫోకస్ పెట్టాను. ఆడియన్స్‌కి కచ్చితంగా నచ్చుతుంది.
* తరువాతా.. లవ్ జోనరా?
జయం దగ్గర మొదలెడితే -చేసిన సినిమాల్లో ఎక్కువ లవ్ స్టోరీలే. కాకపోతే -ఒకదానికొకటి ఎక్కడా సంబంధం ఉండదు. సో, బోర్ ప్రసక్తే ఉండదు. కాకపోతే -ఇకనుంచి లవ్ స్టోరీలు తగ్గిందామనే అనుకుంటున్నా. ప్రస్తుతం చేస్తున్న ‘రంగ్ దే’ కూడా ప్రేమ కథే. కానీ, అది విన్నాక చేయనని చెప్పలేకపోయా.
* మరో జోనర్‌లో..?
పద్దెనిమిదేళ్ల కెరీర్‌లో ఎక్కువ ప్రేమ కథలే చేసినా -గ్రాఫ్ వేరియేషన్స్‌తోనే సాగింది. నిజానికి మంచి ఎక్స్‌పీరియన్స్ అది. అందుకే -ఓ వైవిధ్యమైన సినిమా చేయాలనే బలమైన నిర్ణయంతోనే ఉన్నా. అదే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో చేసే సినిమా. పూర్తి ఫోకస్డ్‌గా చేయాలనుకుంటున్న సినిమా అది.
* తరువాతి ప్రాజెక్టులు?
దర్శకుడు మేర్లపాక గాంధీతో చేయనున్న ప్రాజెక్టు జూన్ నుంచి సెట్స్‌మీదకు వెళ్లొచ్చు. దర్శకుడు కృష్ణచైతన్యతో చేయనున్న ‘పవర్ పేట’ ప్రాజెక్టు కూడా ఆగస్టునుంచి మొదలు కావొచ్చు. ప్రస్తుతానికి వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ సెట్స్‌పై ఉంది. చంద్రశేఖర్ యేలేటితోనూ సినిమా చేస్తున్నా.
* పెళ్లి వార్తలేంటి?
ఏముంది? ఇకపై ననె్నవరూ పెళ్లెప్పుడు అని అడిగే అవకాశముండదు. కెరీర్ కారణంగా పెళ్లికి లెటయ్యాను. మూడేళ్ల ముందే చేసుకోవాల్సింది. కానీ, మెంటల్‌గా ప్రిపేపరవ్వడానికి ఇంత టైంపట్టింది. నా ‘లవ్ స్టోరీ’ లీక్ కాకూడదన్న విషయంలో ప్లాన్ట్‌గానే ఉన్నాం. అమ్మాయిమీద మీడియా అటెన్షన్ ఉండకూడదన్నదే ఆ సీక్రెట్ వెనుక అసలు ఉద్దేశం.
* సినిమా ప్రమోషన్స్ కోసమే పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావిస్తానని ఎవరైనా అంటే -తప్పు లేదు. అది వాళ్ల
అభిప్రాయం. బట్, నా ఫస్ట్ సినిమా నుంచి పాటో, పోస్టరో,
మాడ్యులేషనో.. -ఏదోక రూపంలో పవన్ కనిపిస్తాడు. అట్‌లీస్ట్ వినిపిస్తాడు. పవన్ మీద నాకున్నది ప్యూర్ లవ్. ఎవరెన్ని అనుకున్నా, ఏమనుకున్నా -ఆయనకి జెన్యూన్ ఫ్యాన్ అన్నది నిజం. ఆ విషయం నాకు తెలిస్తే చాలు.
*నా పేరుకి ముందో వెనుకో -కుర్రాడు, యూత్‌లాంటి ట్యాగ్స్ ఇక కట్టైపోతాయి. నిజానికి నన్నలా చూస్తుంటే మనసుకు బావుంటుంది కానీ,
లోపలెక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్. ఇండస్ట్రీకి వచ్చి
పద్దెనిమిదేళ్లైంది. ఇప్పుడిక పెళ్లి కూడా అయిపోతుంది కనుక -యూత్ ట్యాగ్‌ని ఇక తీసెయ్యాలేమో.