త్రివిక్రమ్ @ ఎన్టీఆర్ 30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరోసారి జూ.ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబినేషన్ ప్రాజెక్టు సెట్టైంది. ట్రిపుల్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడన్న అంశంపై వినిపిస్తోన్న రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ -అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, ఇప్పటి వరకూ వినిపించిన ఊహాగానాల్లో త్రివిక్రమ్ తరువాతే మిగిలిన పేర్లు వినిపిస్తూ వచ్చాయి. సో, అంతా ఊహించినట్టే జూ.ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో ప్రాజెక్టును ఓకే చేసుకున్నారు. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత.. వీర రాఘవ’ అనుకున్నంత హిట్టుకాకున్నా.. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ స్టామినాను మరో మెట్టుపైకి తీసుకెళ్లింది. ఓ సీరియస్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్‌ను చూపించిన విధానం అద్భుతమే. ఇప్పుడీ ప్రాజెక్టులో ‘పక్కింటి కుర్రాడి’ పాత్రలో చూపించేందుకు త్రివిక్రమ్ కథల్లాడన్న మాట వినిపిస్తోంది. ఫ్యామిలీ డ్రామాను పూర్తి చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు. రాజవౌళి తెరకెక్కిస్తోన్న ట్రిపుల్ ఆర్ వచ్చే సంక్రాంతికి వస్తున్నా -షూటింగ్ పార్ట్ వచ్చే జూన్‌తో ముగియనుందట. సో, జూన్‌లోనే ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లొచ్చనీ అంటున్నారు. హారిక అండ్ హాసిని తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్టులో -ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కల్యాణ్‌రామ్ భాగస్వామి అవుతున్నాడు. వీళ్లిద్దరి భాగస్వామ్యంలో వచ్చే ఎన్టీఆర్ చిత్రాన్ని -్భరీ బడ్జెట్ సినిమాగానే తెరకెక్కించనున్నట్టు సమాచారం. సంక్రాంతి రేసులో అల.. వైకుంఠపురములో చిత్రం బిగ్గెస్ట్ హిట్‌తో మంచి ఊపుమీదున్న త్రివిక్రమ్ -ఈ ప్రాజెక్టును ఏ రేంజ్‌కి తీసుకెళ్తాడన్న లెక్కలు మొదలయ్యాయి. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామంటూ హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ తాజాగా వెల్లడించాయి.