శ్రీయా.. ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ హీరో రాజశేఖర్‌కు సరైన జోడీ దొరకడం కష్టమవుతోంది. గరుడవేగ తర్వాత కల్కిగా ప్రేక్షకులకు ముందుకొచ్చినా మ్యాజిక్ జరగలేదు. ఇప్పుడు తాజాగా రాజశేఖర్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ఓ కన్నడ రీమేక్ చేస్తున్నాడు. రాజశేఖర్ ఏజ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు చౌదరి -సీనియర్ హీరోయిన్‌నే బోర్డ్‌లోకి ఎంపిక చేసుకున్నాడట. ఆమె ఎవరో కాదు -శ్రీయా శరణ్. హీరోయిన్ స్టామినా కూడా సినిమాకు ప్లస్ అవుతుందని, మరోవైపు గ్లామర్‌ను ఒలికించే శ్రీయ అయితే సినిమాకు ఖచ్చితంగా సరిపోతుందనే ఆమెను తీసుకున్నారన్న కథనాలు వినిపిస్తున్నాయి. శ్రీయ సైతం ప్రాజెక్టుకు ఓకే చెప్పడంతో -సీనియర్ల రొమాన్స్ ఎంతవరకూ మ్యాజిక్ చేస్తుందో చూడాలన్న ఆసక్తి కనిపిస్తోంది.