హిట్.. ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వక్‌సేన్, రుహానీశర్మ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంత్ త్రిపురనేని రూపొందిస్తున్న చిత్రం -హిట్. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -ట్రైలర్ చూస్తుంటే సినిమా తప్పక చూడాలన్న ఆసక్తి కలుగుతుందని, నైజాం వైజాగ్‌లలో సినిమాను తామే విడుదల చేస్తున్నామన్నారు. సినిమా కథ వినగానే వెంటనే నటించాలన్న నిర్ణయం తీసుకున్నానని కథానాయకుడు విశ్వక్‌సేన్ తెలిపాడు. ట్రైలర్ అందరికీ నచ్చుతుందని, థ్రిల్లర్ మూవీగా ట్రైలర్‌లో చూపించిన దానికన్నా ప్రేక్షకులు సినిమాలోనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని, సినిమా మొదటినుండి చివరి వరకు ప్రేక్షకుల్ని అలరించే థ్రిల్స్‌తో రూపొందించామని దర్శకుడు శైలేష్ తెలిపారు. థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా సాగే చిత్రంలో ఎమోషన్, లవ్, సెంటిమెంట్స్ లాంటి అంశాలన్నీ ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో నిర్మాత త్రిపురనేని ప్రశాంతి, మణికందన్, గ్యారీ, రుహానీ శర్మ పాల్గొన్నారు.