23న బగ్గిడి ప్రీరిలీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బగ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై రూపొందించిన బయోపిక్ రైట్ రైట్ బగ్గిడి గోపాల్ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ వేడుక 23న పుంగనూరులో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినిమా వివరాలను బగ్గిడి గోపాల్ వివరిస్తూ -1982 మార్చిలో జరిగిన ఎన్నికల్లో కీలక మార్పులు జరిగాయని, ఆరోజు తాను ఎన్టీఆర్‌తో కలిసి నడిచానన్నారు. రాజకీయ నాయకుడిగా పలు సేవలు ఎలా అందించానో చిత్రంలో చూపించారని, బస్ కండక్టర్ అయిన నేను ఎమ్మెల్యేగా గెలిచి ఏంచేశాననేదే సినిమా కథాంశం అన్నారు. నా జీవితంలోని కొన్ని కీలక సన్నివేశాలు సినిమాలో ఉంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందన్నారు. 23న నిర్వహించే ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలు పాల్గొంటారని వివరించారు.