ప్రయోగాత్మక స్క్రీప్‌ప్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడే మూడు పాత్రలతో ఆడియన్స్‌ని రెండు గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టే ప్రయోగంగా వస్తోన్న చిత్రం -స్క్రీన్ ప్లే. విక్రమ్ శివ, ప్రగతి యాదాటి లీడ్‌రోల్స్‌లో కెఎల్ ప్రసాద్ తెరకెక్కించారు. బుజ్జి బుడుగు ఫిలిమ్స్ బ్యానర్‌పై అరుణకుమారి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి రచయిత పరుచూరి గోపాలకృష్ణ, రాజకీయ విశే్లషకుడు పరకాల ప్రభాకర్, రచయిత విజయేంద్రప్రసాద్, జెకె భారవి, ఆర్ నారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు. రచయిత నుంచి దర్శకుడిగా తొలి సినిమా చేస్తున్న కెఎల్ ప్రసాద్ తెలుగు సినిమాకు దొరికిన వజ్రమని, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా స్క్రీన్ ప్లే అంటూ వక్తలు ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే చిత్రం పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కావడం టాలీవుడ్‌కు గర్వకారణం అన్నారు. సినిమాకు సంగీతం సమకూర్చిన ఎంఎ శ్రీలేఖ మాట్లాడుతూ -సినిమాలో ఉన్నది ఒకే పాటైనా పది పాటల పెట్టన్నారు. ప్రయోగాత్మక చిత్రానికి ఎంవి రఘు సినిమాటోగ్రఫీ సమకూర్చారు. త్వరలో సినిమాను విడుదల చేయనున్నారు.