మనోజ్‌తో ప్రియా రొమాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్ల గ్యాప్ తరువాత సొంత బ్యానర్‌పై మంచు మనోజ్ సర్‌ప్రైజింగ్ ప్రాజెక్టు ప్రకటించాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు వీలుగా డిఫరెంట్ కానె్సప్ట్ ఎంచుకున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌రెడ్డి పనితనంపై నమ్మకంతో రేసులోకి దిగుతున్నాడు. వైవిధ్యమైన స్క్రిప్ట్‌లో ఫ్రెష్ ఫేస్ బెటరన్న ఆలోచనతో -ఓ యాంకర్‌ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె -తమిళ టెలివిజన్ షో హాట్ సెనే్సషన్ ప్రియా భవానీ శంకర్. టెలివిజన్ షోలో వచ్చిన పాపులారిటీతో ప్రియా ఇప్పటికే ఓ పెద్ద ప్రాజెక్టులో చాన్స్ కొట్టేసింది. పాన్ ఇండియా క్యాటగిరీలో కమల్‌తో శంకర్ తెరకెక్కిస్తోన్న భారతీయుడు-2లో ఓ పాత్ర చేస్తోంది. భారతీయుడు సీక్వెల్ ఫేమ్‌గా ప్రియకు వచ్చే ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని -మనోజ్ ఆమెను హీరోయిన్‌గా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మనోజ్ సరసన టాలీవుడ్‌కు -తమన్నా, సిమ్రాన్ కౌర్, లేఖ వాషింగ్టన్‌లాంటి హీరోయిన్లు పరిచయమయ్యారు. వీరిలో తమన్నా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో -ప్రియ కెరీర్ ఏ రేంజ్‌కి వెళ్తుందో చూడాలి.