మణి చిత్రంలో శోభితకు చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళకు చాన్స్ వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్‌తో మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్ లీడ్‌రోల్స్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ చెన్నైలో పూరె్తైంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా ప్రాజెక్టులోకి శోభితకు వైవిధ్యమైన పాత్రను మణి ఇచ్చారు. బాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తూనే ఆమధ్య తెలుగులో గూఢచారితో పరిచయమైంది శోభిత ధూళిపాళ. సినిమా సక్సెస్ కాకపోవడంతో, శోభితకు అశించినన్ని అవకాశాలు రాలేదు. ప్రస్తుతం కురుప, లక్ష్మీబాంబు చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు ఘోస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లోనూ శోభిత నటిస్తోంది. కూచిపూడి డ్యాన్సర్ కావడంతో మణిరత్నం తాను రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్‌లో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. శోభిత కెరీర్‌కు ఈ పాత్ర టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి.