హార్డ్ వర్కే.. నా సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, రష్మిక జోడీగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న చిత్రం - భీష్మ. ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. అందులో భాగంగా తొలిసారి నితిన్‌తో జోడీకట్టిన రష్మిక ఆదివారం మీడియాతో ముచ్చటించింది.
* భీష్మలో నా పాత్ర చాలా బావుంటుంది. నేను చేసిన డ్యాన్స్, పెర్ఫార్మెన్స్ అన్నీ బాగా వచ్చాయనే అనుకుంటున్నా. వీటికిమించి -్ఫల్‌లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టోరీలో నా పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్టవ్వడం ఖాయం. ఈ కథలోని ఫన్‌ను ఆడియన్స్‌కి మంచి అనుభూతి ఇస్తుందనే అనుకుంటున్నా.
* భీష్మగా టైటిల్ రోల్‌ని నితిన్ చేస్తున్నాడు. అయితే, భీష్మగా ఏం చేశాడన్నది స్క్రీన్‌మీదే చూడాలి. చెప్పేస్తే -థ్రిల్ ఉండదు.
* హార్డ్‌వర్క్‌తో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే -స్టార్ హీరోలతో సినిమాలు అవే వస్తాయి. మనం తెచ్చుకోవడం అంటూ ఏమీ ఉండదు. ఫలానా పాత్రకు రష్మిక బావుంటుంది అనుకుంటేనే అవకాశాలిస్తారు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాం కదాని, మనం మారిపోయేదీ ఉండదు. నావరకూ -నేను వచ్చినపుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నా. స్టార్ హీరోల కాంబినేషన్స్ చేస్తున్నాను కనుక కేర్ తీసుకోవాలని కూడా అనుకోను. నాకు వచ్చినట్టు.. నాకు నచ్చినట్టే చేస్తూ వస్తున్నా.
*సక్సెస్ ఎప్పుడూ లక్ వల్ల రాదు, హార్డ్‌వర్క్‌తోనే సాధ్యం. ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానంటే అదే కారణం. తక్కువ టైంలో స్టార్‌డమ్ రావడానికి కారణం -మంచి స్క్రిప్ట్‌లను చూస్ చేసుకుంటున్నా. ఆ స్క్రిప్ట్‌లో నా పాత్రతో మెప్పించేందుకు
కష్టపడుతున్నా. అదే నా సక్సెస్.
* ఏదైనా ప్రాజెక్టుని ఓకే చేయడానికి, వదులుకోడానికి చాలా కారణాలే ఉంటాయి. పెద్ద సినిమాలు చేస్తున్నాను కనుక, చిన్న సినిమాలు వదిలేయాలి అన్నదేమీ ఉండదు. ఇప్పటి వరకూ ఓ 50 స్క్రిప్ట్‌లు రిజెక్ట్ చేసి ఉంటాను. కానీ, ఒక్క మంచి కథను కూడా వదలుకోలేదు. నా సక్సెస్‌లో హార్డ్‌వర్క్‌కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, మంచి స్క్రిప్ట్‌ల్ని ఎంపిక చేసుకోవడానికీ అంతే ప్రాధాన్యత ఉంటుంది.
* సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నా పాత్రపై విమర్శలు వచ్చాయంటే నేను నమ్మను. ఒకవేళ వచ్చినా -నా ఎదుగుదలకు ఉపయోగపడతాయన్న భావనతో స్వీకరిస్తా. ఆ సినిమాలో ఆ పాత్ర గ్రాఫ్ అలా ఉంటుంది. కొన్నిచోట్ల ఓవర్‌గా రియాక్ట్ కావాలి. అది దర్శకుడి విజన్. అందుకే అలా చేయాల్సి వచ్చింది.
* ఒక రొమాంటిక్ మూవీతో వాలెంటైన్స్ డే ఎంజాయ్ చేద్దామనుకున్నా. అరగంటకే ఆ ఇంగ్లీష్ సినిమా బోర్ కొట్టేసింది. సో, ఈ వాలెంటైన్స్ డే చాలా బోర్‌గా సాగిపోయిందనే అనుకుంటున్నా.
* ఇక - భీష్మ తరువాత కూడా పెద్ద ప్రాజెక్టుల్లోనే చేస్తున్నా. మార్చి నుంచి సుకుమార్ -బన్నీ కాంబో ప్రాజెక్టులో జాయిన్ అవుతాను. అలాగే తమిళంలో హీరో కార్తితో ఒక సినిమా చేస్తున్నాను.