మనోజ్.. అహం బ్రహ్మాస్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యత్ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తానంటూ కొద్దిరోజులుగా ప్రకటిస్తోన్న మంచు మనోజ్ -అన్నట్టుగానే ‘అహం బ్రహ్మస్మి’ అంటూ గురువారం ఓ పోస్టర్‌ని వదిలాడు. బలమైన ఈ టైటిల్‌తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రాజెక్టుని తెరకెక్కించనున్నట్టు ప్రకటన విడుదలైంది. తనను తను ప్రూవ్ చేసుకోడానికి ఓ మంచి స్క్రిప్ట్ కోసం చాలాకాలం ఎదురు చూసిన మనోజ్ -ఫైనల్‌గా శ్రీకాంత్ ఎన్ రెడ్డి స్క్రిప్ట్‌ని ఓకే చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మలాదేవితో కలిసి మనోజ్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాడు. మార్చి 6న సినిమాను లాంచ్ చేస్తామని, మిగిలిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని ‘అహం బ్రహ్మస్మి’ టీం పేర్కొంది.