ప్రెజర్ కుక్కర్ టైటిలే వెరైటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రెజర్ కుక్కర్ -చిత్రంలో తెలంగాణ స్లాంగ్ నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పానంటోంది హీరోయిన్ ప్రీతీ అస్రాని. టైటిలే గమ్మత్తుగా అనిపించిందని, కథ వినగానే ఓకే చెప్పేశానంటోంది. సాయిరోనక్, ప్రీతి అస్రాని జోడీగా సుజోయ్ అండ్ సుశీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం 21న థియేటర్లకు వస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో ప్రీతి మాట్లాడింది. -సినిమాలో సోషల్ యాక్టివిస్ట్ అనిత పాత్ర పోషిస్తున్నా. ఇది హీరోకి పూర్తి విరుద్ధమైన పాత్ర. బీటెక్ పూర్తిచేసిన కుర్రాడిపై పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేషన్స్ నుంచి అమెరికాలో సెటిలవ్వాలంటూ వత్తిడి వస్తుంటుంది. దాంతో ఆ కుర్రాడు -ప్రెజర్ కుక్కర్‌లో ఉన్నట్టు ఫీలవుతాడు. అందుకే ఈ టైటిల్ పెట్టారు. వాస్తవానికి దగ్గరగా ఉండే -కామెడీ, లవ్, ఎమోషన్స్.. సమ్మిళిత సమాహారం ఈ సినిమా. ఇక నా గురించి చెప్పాలంటే -మాది గుజరాత్. అక్క టీవీ యాక్ట్రెస్ కావడంతో, ఆమె స్ఫూర్తితో నటనవైపు వచ్చా. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో చేశాక ‘మళ్లీ రావా’ సినిమాలో ఓ పాత్ర చేశా. పక్కింటి అమ్మాయి సీరియల్‌లోనూ నటించాను. హీరోయిన్‌గా నాకిది తొలి సినిమా. హీరో గోపీచంద్ ‘సీటీమార్’ చిత్రంలో కబడ్డీ టీం కెప్టెన్‌గా కనిపించనున్నాను అని చెప్పింది.