మనలోనూ.. ఓ అశ్వథ్థామ ఉంటాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారతంలోని ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో -తప్పుని తప్పు అని చెప్పినవాడు అశ్వథ్థామ. ఈ కథలోనూ కథానాయకుడి లక్షణం అదే. మహిళల రక్షణకు నడుంకట్టిన హీరో కథ కనుక -అశ్వథ్థామ ఆప్ట్ టైటిల్ అంటోంది హీరోయిన్ మెహ్రీన్ కౌర్.
పూర్తి యాక్షన్ జోనర్‌లో నాగశౌర్య నుంచి వస్తున్న తాజా చిత్రం -అశ్వథ్థామ. మెహ్రీన్ హీరోయిన్. నాగౌశౌర్య రాసుకున్న కథతో కొత్త దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన చిత్రం జనవరి 31న థియేటర్లకు వస్తోంది. ఈ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్‌లో మెహ్రీన్ చెప్పిన సినిమా ముచ్చట్లు.
* మహిళలపై అఘాయిత్యాలు జరిగినపుడు చాలామందిలా నేను సోషల్ మీడియాలో రియాక్ట్ కాను. అలాంటి రియాక్షన్స్‌తో సొల్యూషన్ దొరకదని నా నమ్మకం. నా దృష్టిలో అందరిలోనూ ఓ అశ్వథ్థామ ఉంటాడు. సందర్భానుసారం బయటకు తేవాలంతే. అలాంటి ఆలోచన ఈ సినిమా ఇస్తుందన్న నమ్మకంతోనే ఇందులో పాత్ర చేశా.
* హీరో నాగశౌర్య స్నేహితుడి సోదరి లైఫ్‌లో చోటుచేసుకున్న ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రాసుకున్న కథ ఇది. అఫ్‌కోర్స్ సోసైటీలో చోటుచేసుకున్న చాలా ఇన్సిడెంట్స్ ఈ కథకు దగ్గరగా అనిపించొచ్చు. నాగశౌర్యకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్.
* ఇలాంటి కథలో నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఏంటి? అంటే ఇప్పుడే చెప్పలేను. బట్, ప్రొటగానిస్ట్ పాత్రకు నా పాత్ర చాలా హెల్ప్ చేస్తుంటుంది. అన్ని చిత్రాల్లోనూ పాత్రని బేరీజు వేసుకుని చేయలేం. కొన్ని ప్రాజెక్టు -కంటెంట్ ఇంపార్టెన్స్ చూసి కూడా ఒప్పుకోవాలనిపిస్తుంది. నావరకూ ఈ సినిమా అలాంటిదే.
* సినిమా అనేది ఓ మీడియం మాత్రమే. చాలా సినిమాల్లో విలన్ రోల్స్ ఫిక్షనల్‌గానే ఉంటాయి. అలాగని విలన్లు లేరనలేం. బాధాకరమైన ఇన్సిడెంట్ కళ్ళముందు జరుగుతున్నా పట్టించుకోని వాళ్లంతా నా దృష్టిలో విలనే్ల. అలాంటి వాళ్లలో చిన్న కదలిక తీసుకొచ్చే సినిమా అశ్వథ్థామ. మార్పు మనలో రావాలి. మనలోంచే రావాలన్నది నా అభిమతం.
* కామెడీకి చాన్స్‌లేని కంప్లీట్ సీరియస్ సినిమా ఇది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగే ఏమోషనల్ థ్రిల్లర్ స్టోరీ. ట్రైలర్‌లో చూపించిన పెయిన్‌ఫుల్ ఎలిమెంట్స్ సినిమాలో చాలా హార్ట్‌టచ్చింగ్‌గా ఉంటాయి. హీరో సిస్టర్‌కి జరిగిన ఓ ఇన్సిడెంట్ నుంచి హీరో జర్నీ మొదలవుతుంది. ఇది చాలు, కథలో ఏముంటుందో చెప్పడానికి.
* ఇలాంటి కథలో చేయడం నాకూ, శౌర్యకూ కొత్తే. ఈ సినిమాతో శౌర్యకున్న లవర్‌బోయ్ ఇమేజ్ మాత్రం పూర్తిగా మారుతుందనే అనుకుంటున్నా.
* రాసుకున్న కథను మాత్రమే నాగశౌర్య ఇచ్చాడు కానీ, ప్రాజెక్టులో అతని ఇన్వాల్వ్‌మెంట్ ఏమీ ఉండదు. కేవలం హీరో పాత్ర చేశాడు. స్టోరీ నేరెట్ చేయడం నుంచీ దర్శకత్వం వరకూ అన్నీ చూసుకున్నది డైరెక్టర్ రమణతేజ. అతని వర్క్ టాలెంట్ సినిమాలో చూస్తారు.
* అఫ్‌కోర్స్, ఇప్పుడు నేను చాలా హ్యాపీ మూడ్‌లో ఉన్నాననుకోవాలి. రీసెంట్‌లో తమిళంలో పటాస్ విడుదలైంది. ఇక్కడ ‘ఎంత మంచివాడవురా’ థియేటర్లలో ఉంది. ఇప్పుడు అశ్వథ్థామ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎగ్జైటవుతున్నా.