శ్రీకాంత్ మరణమృదంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్‌ని యాక్షన్ రివేంజ్ పాత్రలో చూపిస్తూ కొత్త దర్శకుడు వెంకటేష్ రెబ్బ మొదలుపెట్టిన చిత్రం -మరణమృదంగం. మల్టీ కలర్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై లక్ష్మీ రెడ్డి సమర్పణలో మధు రెబ్బ, చిరంజీవి వబ్బిలిశెట్టి సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్‌నివ్వగా, చిరంజీవి మరణమృదంగం చిత్రానికి దర్శకత్వం వహించిన ఎ కోదండరామిరెడ్డి కెమెరా స్విన్ ఆన్ చేసి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమవేశంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ -నాకు ఇష్టమైన చిరంజీవి టైటిల్‌తో సినిమా చేస్తుండటంపట్ల చాలా హ్యాపీగా ఉన్నా. వెంకటేష్ రెబ్బ కథ చెప్పినట్టు ఆసక్తికరం అనిపించింది. ఇప్పుడున్న ట్రెండ్‌లో ఈ సినిమా హిట్టు ఖాయం అనిపిస్తోంది. పక్కా ప్లానింగ్‌తో అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసి సినిమాను థియేటర్లకు తెస్తాం అన్నారు. దర్శకుడు వెంకటేష్ రెబ్బ మాట్లాడుతూ -రైటర్ తులసీదాస్ ఓ మంచి కథ ఇచ్చారు. దాన్ని చదివినపుడు శ్రీకాంత్‌కు ఆప్ట్ అవుతుందని అనిపించింది. శ్రీకాంత్ సినిమాలూ చూస్తూ పెరిగిన నేను, ఇప్పుడు ఆయన సినిమాకి డైరెక్షన్ చేస్తుండటం మర్చిపోలేని విషయం. నాకు సపోర్ట్ చేస్తున్న నిర్మాత మధు రెబ్బకు ధన్యవాదాలు అన్నారు. నిర్మాత మధు రెబ్బ మాట్లాడుతూ -సినిమా తపన అందరికీ ఉంటుంది. దాంతోపాటు క్రియేటివ్ థాట్స్, టెక్నికల్ అవేర్‌నెస్, మేకింగ్ కంఫర్టుబిలిటీ ఉన్నవాళ్లే రాణిస్తారు. అలాంటివాళ్లలో వెంకటేష్ రెబ్బ ఉంటాడు. అతను చెప్పిన కథా కథనాలు నచ్చి శ్రీకాంత్‌తో సినిమా మొదలెడుతున్నాం. మంచి విజయం అందుకుంటామన్న నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ జిఎల్ బాబు, సంగీతం మంత్రి ఆనంద్ సమకూరుస్తున్నారు.