ఫిబ్రవరి 7న అనుకున్నదొక్కటి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ పతాకాలపై దర్శకుడు బాలు అడుసుమిల్లి తెరకెక్కించిన తొలి చిత్రం -అనుకున్నదొకటి.. అయ్యిందొక్కటి. హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రాన్ని ఫిబ్రవరి 7న థియేటర్లకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ -మహానగరంలో నివహించే నలుగురి అమ్మాయిల కథతో వస్తున్న చిత్రమిది. హైదరాబాద్‌లో ఉండే నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం గోవా వెళ్తారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. కథ, కథనాలు కొత్త తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇదొక న్యూ ఏజ్ సినిమా అన్నారు. ఈ చిత్రానికి శేఖర్ గంగమోని సినిమాటోగ్రఫీ, వికాస్ బడిజ సంగీతం సమకూర్చారు.