బయోపిక్‌లా.. రైట్ రైట్ బగ్గిడి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సామాన్య కండక్టర్ ఉన్నతమైన వ్యక్తిగా ఎలా ఎదిగాడన్న కానె్సప్ట్‌తో బగ్గిడి ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై అర్జున్‌కుమార్ తెరకెక్కించిన చిత్రం -బగ్గిడి గోపాల్. ఫిబ్రవరి 28న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. కార్యక్రమానికి హాజరైన తుమ్మలాపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ -సీనియర్ హీరో సుమన్ నటిస్తోన్న బగ్గిడి గోపాల్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. బయోపిక్‌లకు మంచి ఆదరణ దక్కుతున్న టైంలో వస్తున్న ఓ బయోపిక్ ఇది. ఓ సామాన్య ఆటో డ్రైవర్ ఎమ్మెల్యే స్థాయికి ఎలా ఎదిగాడన్న అంశం చిత్రకథాంశం. సినిమాలో సుమన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు అన్నారు. సుమన్ మాట్లాడుతూ దర్శకుడు అర్జున్ కుమార్ తీసిన సినిమా కథ ఆదర్శప్రాయమైంది. కొత్త నిర్మాత బగ్గిడి గోపాల్ సినిమా తీస్తున్నారు. రొటీన్‌కు భిన్నమైన చిత్రాన్ని అంతా ఆదరించాలని కోరుతున్నా అన్నారు. బగ్గిడి గోపాల్ మాట్లాడుతూ -1982 మార్చిలో రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అదే రోజు నేను ఎన్టీఆర్‌తో కలిసి నడిచాను. తాను పెట్టిన పార్టీలో నేను చేసిన కృషి, సేవలు ఈ బగ్గిడి గోపాల్ చిత్రంలో చూపిస్తున్నాం. సెన్సార్ పూరె్తైంది. త్వరలోనే ప్రీ గ్రాండ్ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తాం. నా గురించి, నా జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ముఖ్య సంఘటనల సమాహారంగా వస్తోన్న చిత్రాన్ని నా కుటుంబానికి అంకితమిస్తున్నా అన్నారు. మంచి పాత్రనిచ్చి అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు హీరోయిన్ చందన కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు అర్జున్‌కుమార్ మాట్లాడుతూ -సినిమాను డైరెక్ట్ చేస్తూనే ఒక పాత్ర చేశా. బగ్గిడి గోపాల్ నిజాయితీ కలిగిన వ్యక్తి. ఆయనతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. చిన్ని సినిమాకు మీడియా సపోర్ట్ కావాలని కోరుతున్నా అన్నారు.