30న డబ్‌శ్మాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కృష్ణ, సుప్రజ హీరో హీరోయిన్లుగా గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో కేశవ్ దేపూర్ తెరకెక్కించిన చిత్రం -డబ్‌శ్మాష్. వీత్రీ ఫిల్మ్స్ పతాకంపై ఓంకార లక్ష్మి నిర్మించిన చిత్రం జనవరి 30న థియేటర్లకు వస్తోన్న సందర్భంలో ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ దర్శక, నిర్మాతల ప్రత్యేక శ్రద్ధతో మంచి మ్యూజిక్ ఇవ్వగలిగానని, సినిమాకు అందరికీ నచ్చుతుందన్నాడు. నటి స్పందన మాట్లాడుతూ టిక్ టాక్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్‌కు అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ -దర్శకుడు కేశవ్‌లో సినిమాపట్ల తపన చూసి ఈ ప్రాజెక్టు చేశా. సినిమాలో అంతా కొత్తవాళ్లే అయినా మంచి పెర్ఫార్మెఃన్స్ ఇచ్చారు. గెటప్ శ్రీను మంచి కోపరేటివ్ పర్సన్. ప్రాణంపెట్టి సినిమా చేసిన టీం అందరికీ మంచి భవిష్యత్ ఉండాలని ఆశిస్తున్నా అన్నారు. గెటప్ శ్రీను మాట్లాడుతూ -పదకొండేళ్ల క్రితమే దర్శకుడితో పరిచయం. అప్పటినుంచీ నన్ను ప్రోత్సహిస్తున్నారు. కష్టపడి చేసిన సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు కేశవ్ దేపూర్ మాట్లాడుతూ -ఏంకావాలన్నా ఇవ్వగలిగే టెక్నీషియన్స్ దొరికితే సినిమా తప్పకుండా విజయం సాధించినట్టే. ఈ సినిమాకు బెస్ట్ టెక్నీషియన్లు పనిచేశారు. 20 నిమిషాలపాటుండే విఎఫ్‌ఎక్స్ ఆడియన్స్‌కి నచ్చుతుంది. జస్ట్ లైన్‌విని ప్రోత్సహించటమే కాదు, నచ్చి సినిమా చేసిన నిర్మాతకు కృతజ్ఞతలు. స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చాలా సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. డబ్‌స్మాష్ వల్ల ఏం జరిగిందన్న కథాంశంతో స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా 30న థియేటర్లకు వస్తోంది. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడం ఖాయం అన్నారు. హీరో పవన్‌కృష్ణ మాట్లాడుతూ -నా ఫస్ట్ మూవీ పాటలకు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. దర్శక, నిర్మాతల సహకరాంతో టీంమొత్తం కష్టపడ్డాం. సినిమా ఆడియన్స్‌కి నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం అన్నారు.