వైల్డ్ డాగ్‌తో వెరీ వైల్డ్ బ్యూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నాగార్జున చేస్తున్న తాజా ప్రాజెక్టు -వైల్డ్‌డాగ్. ఈ ప్రాజెక్టులో నాగ్‌తో ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనుంది వైల్డ్ బ్యూటీ సయామీ ఖేర్. బాలీవుడ్‌లో రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తెరకెక్కించిన ‘మిర్జియా’తో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఇతర భాషా చిత్రాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గత ఏడాది మరాఠీ మూవీతో ఆడియన్స్ అప్లాజ్ అందుకున్న సయామీ -తాజాగా నాగ్ పవర్ ఫ్యాక్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘వైల్డ్ డాగ్’లో తన యాక్షన్ పెర్ఫార్మెన్స్ చూపించేందుకు రెడీ అవుతోంది. సయామీ పాత్రకు కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ సీన్లు ఉంటాయన్నది చిత్రబృందం చెబుతోన్న మాట. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తవ్వడంతో, తదుపరి షెడ్యూల్‌లో సయామీ చేరనుందట. ‘ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగమవుతున్నందుకు హ్యాపీగా ఉంది. నాగ్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు లభించే గౌరవం. యాక్షన్ ఫిల్మ్ చేయాలన్నది చాలాకాలంగావున్న కోరిక. ఆ జోనర్ చిత్రాలు బాగా ఇష్టపడతాను. ఇప్పుడు వైల్డ్‌డాగ్ ప్రాజెక్టులో చాన్స్ రావడంతో కొద్దిరోజులుగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నా. సెట్స్‌పై జాయిన్ కావడంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’ అంటోంది సయామీ. హాలీవుడ్‌లో వచ్చిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కు పనిచేసిన డేవిడ్ ఇస్మాలోన్ ‘వైల్డ్ డాగ్’ యాక్షన్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. నిరంజన్‌రెడ్డి, అనే్వష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని యథార్ధ ఘటనల స్ఫూర్తితో రాసిన కథతో అహిషోల్ సాల్మన్ తెరకెక్కిస్తుండటం తెలిసిందే. ఈ సందర్భంగా మ్యాట్నీ ఎంటర్‌టైనె్మంట్ అధినేతలు మాట్లాడుతూ ‘ప్రాజెక్టులోకి సయామీ చేరడంపట్ల హ్యాపీగా ఉంది. ఆమెకు సరిగ్గా సరిపోయే పాత్రలో ఆమె కనిపిస్తుంది’ అన్నారు.