అంతులేని.. ‘ఓ పిట్టకథ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని కథలు నిడివి తక్కువగా వున్నా -జీవితాంతం గుర్తుండే ఆసక్తికరమైన విషయాన్ని చెబుతుంటాయి. అలాంటివాటినే ‘పిట్టకథలు’ అంటుంటాం. అలాంటి ఓ ఆసక్తికరమైన పిట్ట కథను సెల్యూలాయిడ్‌పై చూపించబోతోంది భవ్య క్రియేషన్స్. భారీ చిత్రాలను నిర్మించే ఈ సంస్థ తాజాగా తెరకెక్కిన ఓ క్యూట్ కథకు ‘ఓ పిట్టకథ’ టైటిల్ ఫిక్స్ చేసింది. టైటిల్ పోస్టర్‌ను దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. చెందు ముద్దు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వి ఆనందప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ -ఈ సినిమాతో నాకో లింకుంది. అదేంటంటే -ఈ కథ నాకు తెలియడమే. కథ విన్నపుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. దర్శకుడు చందు ఎంపిక చేసుకున్న రెండు మూడు టైటిల్స్‌లో ‘ఓ పిట్టకథ’ బాగా నచ్చింది. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ అనే క్యాప్షన్ యాడ్ చేయమని మాత్రమే సలహా ఇచ్చా. ప్రేక్షకులకు కనెక్టవుతుందన్న నమ్మకమైతే నాకుంది అన్నారు. ఆనందప్రసాద్ మాట్లాడుతూ -బాలకృష్ణ, గోపీచంద్‌లాంటి హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూనే, కొత్తవాళ్లన ప్రోత్సహించేందుకు దర్శకుడు తేజతో నీకూ నాకూ డాష్ డాష్ అనే సినిమా తీశాం. మరోసారి కొత్తవాళ్లతో కథ చేద్దామన్న ఆలోచన వచ్చినపుడు దర్శకుడు చందు చెప్పిన కథ ఇంట్రెస్టింగ్ అనిపించింది. వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్లాం. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు అన్నారు. కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగే పిట్టకథ ఆడియన్స్‌కి కచ్చితంగా కనెక్టవుతుందన్న నమ్మకం ఉందన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనే్న రవి. దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ -ఇదో విలేజ్ స్టోరీ. ప్రతి సీన్ ఫ్రెష్ ఫీల్‌నిస్తుంది. నవ్విస్తూనే ఉత్కంఠ రేకెత్తించే కథ ఇది. ఇదొక స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ అన్నారు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి ఇతర పాత్రలు పోషిస్తోన్న చిత్రానికి సునీల్‌కుమార్ యన్, ప్రవీణ్ లక్కరాజులు సినిమాటోగ్రఫీ, సంగీతం సమకూరుస్తున్నారు.