మే 8న క్రాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ -క్రాక్. రవితేజ బర్త్‌డే సందర్భంగా సినిమా విశేషాలను వెల్లడిస్తూ వచ్చే మే 8న క్రాక్‌ను థియేటర్లకు తేనున్నట్టు నిర్మాత ఠాగూర్ మధు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌పై పోలీస్ యూనిఫాంలో వెహికల్ నంచి బయటకు చూస్తున్న రవితేజ బిందాస్ స్టిల్‌ను బయటకు వదిలారు. ప్రస్తతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న క్రాక్ చిత్రంలో రవితేజతో శృతిహాసన్ రొమాన్స్ చేయనుంది. అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇంటెన్స్ స్టోరీతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చిత్రబృందం చెబుతోంది. తమిళ నటులు సమద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సరస్వతి ఫిల్మ్ డివిజన్‌పై బి మధు నిర్మిస్తోన్న చిత్రానికి తమన్ సంగీతం, జికె విష్ణు సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.