దూసుకుపోతున్న డిస్కోరాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ తాజా చిత్రం డిస్కోరాజా వౌత్ టాక్‌తో విజయాన్ని అందుకుందని, ముఖ్యంగా మాస్‌రాజా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారని చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ వ్యాఖ్యానించాడు. రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభానటేష్, తాన్యాహోప్, వెనె్నల కిశోర్ ప్రధాన తారాగణంగా ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామ్ తాళ్లూరి రూపొందించిన చిత్రం -డిస్కో రాజా. విడుదలైన చిత్రానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్రబృందం పేర్కొంది. విజయానందంతో చిత్రబృందం కేక్ కట్ చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ -సినిమా ఇంటర్‌వెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చాయని, ముఖ్యంగా రవితేజ, వెనె్నల కిషోర్ హాస్యం తెరపై అద్భుతంగా పండిందన్నారు. పాయల్ రాజ్‌పుత్, రవితేజ కాంబినేషన్ ప్రేక్షకులకు కన్నుల పండువలా వుందని, ఇండియాలోనే కాక ఓవర్‌సీస్‌లోనూ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతుండడం హ్యాపీగా ఉందన్నారు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ -అన్ని ఏరియాలనుండి డిస్కోరాజా హిట్ టాక్ అందుకున్నాడని, ప్రతి కేంద్రంలో అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయని తెలిపారు. ప్రతి థియేటర్ వద్ద హిట్ టాక్ విన్పిస్తోందని, హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రం రూపొందించారని ప్రేక్షకులు చెబుతుండడం చిత్ర విజయానికి తొలిమెట్టన్నారు. అన్ని ఏరియాలనుండి మంచి రెస్పాన్స్ లభిస్తోందని, ఆడియెన్స్ ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇస్తున్నారని, హాలీవుడ్ స్థాయిలో సినిమాను తెరకెక్కించిన దర్శకుడికి అభినందనలని కార్తికేయ ఎగ్జిబిటర్స్ అధినేత అన్నారు. హాలీవుడ్ స్థాయిలో రూపొందించిన చిత్రం కనుక మాస్ ఆడియెన్స్‌కు సినిమా ఎక్కడానికి కొంత టైమ్ పడుతుందని, తప్పక హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తమ సంస్థలకు మంచి పేరు తెచ్చిందన్నారు. రవితేజ, చిత్ర యూనిట్ పాలొంది.