మళ్లీ స్పై’డర్‌గా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిట్లు, బ్లాక్‌బస్టర్ల లెక్కలు కాసేపు పక్కనపెడితే -హ్యాట్రిక్ హిట్టుతో కెరీర్‌ను కూల్ ట్రాక్‌మీదికి తీసుకొచ్చాడు మహేష్‌బాబు. శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం, ఏఆర్ మురుగదాస్ స్పైడర్ చిత్రాలు కేరీర్‌ను క్రైసిస్‌లో పడేసినా -తరువాత మూడు వరుస హిట్లుతో మళ్లీ తన స్టామినా చూపించాడు. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్టందుకున్న మహేష్ -తదుపరి ప్రాజెక్టును వంశీ పైడిపల్లికి రిజర్వ్ చేసి పెట్టడం తెలిసిందే. అయితే, ప్రాజెక్టుని సెట్స్‌పైకి తెచ్చేందుకు మహేష్ కొంత టైం తీసుకుంటాడన్నది తాజా కథనం. సెట్స్‌పైకి వెళ్లేందుకు వంశీ పైడిపల్లి సిద్ధంగానేవున్నా, కొత్త ప్రాజెక్టులో మహేష్ మేకోవర్ కోసం టైం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ టైంలోనే ప్రీప్రొడక్షన్ పనులూ కంప్లీట్ చేసేసి -మేలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తారని తెలుస్తోంది. కొత్త ప్రాజెక్టులో -మహేష్ మరోసారి ‘స్పై’ రోల్ చేస్తుండటంతో -సరికొత్త మేకోవర్‌ని ట్రై చేయొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా గత మూడు సినిమాల్లో మహేష్ తన రెగ్యులర్ ప్యాట్రన్‌లోనే కనిపించాడు. ఫ్యాన్స్ మాటెలావున్నా, ఆడియన్స్‌కి బోర్‌కొట్టే ప్రమాదం ఉండటంతో -ఈసారి మేకోవర్ మార్చొచ్చన్న మాట వినిపిస్తోంది. అలాగే, గతంలో మురుగదాస్‌తో చేసిన ‘స్పైడర్’లో మహేశ్ స్పై రోలే చేశాడు. హైస్టాండర్డ్స్‌లోవున్న సినిమా ఆడియన్స్‌కి కనెక్ట్ కాకపోవడంతో, మహేష్ అకౌంట్‌లో అదొక ఫెయిల్యూర్‌గా లిస్టైంది. అయితే, అదే పాత్రలో మహేష్ స్టామినాను చూపించేందుకు వంశీ పైడిపల్లి ‘స్పై’ క్యారెక్టర్‌తో సాహసమే చేయనున్నాడట. మహేష్‌కు ఇది 27వ సినిమా అవుతుంది.