నాగ్ నుంచి తెలుగు.. 83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జట్టు 1983లో కపిల్‌దేవ్ సారధ్యంలో విశ్వవిజేతగా ఆవిర్భవించిన చరిత్రను మరోసారి ప్రేక్షకులకు, క్రికెట్ అభిమానులకు కనువిందు చేయడానికి రూపొందిస్తున్న చిత్రం 83. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థతోపాటుగా అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ అసాధారణ ప్రయాణాన్ని వెండి తెరపై ఆవిష్కరిస్తున్న దర్శకుడు కబీర్‌ఖాన్. దీపికాపదుకొనే, సాజిద్ నాడియావాలా, కబీర్‌ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి తదితరులు నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రాన్ని ఏప్రిల్ 10 తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ క్రికెట్ లోకంలో 1983లో మన దేశం గొప్ప విజయాన్ని సాధించింది. ఈ విజయం మన దేశంలో క్రికెట్ ఓ మతం అనేంతగా గొప్పగా మారిపోయింది. ఈ ప్రయాణాన్ని గురించి చెప్పే చిత్రమే ఇది. ఈ జర్నీ గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. విశ్వవిజేతగా ఉన్న వెస్టండీస్ జట్టుని ఓడించి, మన దేశం తొలిసారిగా క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకునే కథనంతో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగులో మా సంస్థ ద్వారా విడుదల చేయడం సంతోషంగా ఉంది అని తెలిపారు. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు కబీర్‌ఖాన్ అన్నారు. కార్యక్రమంలో సిఈఓ షిబాసిస్ సర్కార్ పాల్గొని విశేషాలు తెలిపారు.