మర్డర్స్ మిస్టరీతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వథ్థామ. యాక్షన్ జోనర్‌లోకి అడుగుపెట్టిన హీరో నాగశౌర్య నుంచి రానున్న తాజాచిత్రం. కొద్దిరోజుల క్రితం టీజర్‌తో ఆసక్తిపెంచిన అశ్వథ్థామ నుంచి తాజాగా వచ్చిన ట్రైలర్ -ఓకే అనిపించుకుంది. సమాజంలోని కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా అశ్వథ్థామ కథను నాగశౌర్య సిద్ధం చేయడం తెలిసిందే. యువతుల అనుమానాస్పద హత్యలు. ఒకరికొకరికి సంబంధం లేకుండా సాగే హత్యాకాండ వెనుక అసలు మిస్టరీ? సూత్రధారి ఎవరు? గొలుసు హత్యల వెనుక అంతరార్థం? లాంటి మిస్టరీని ఛేదించే హీరో పాత్రలో నాగశౌర్య కనిపించాడు. సంచలనం రేకెత్తించిన దిశలాంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్న తరుణంలో -అలాంటి కంటెంట్‌తో వస్తున్న అశ్వథ్థామ ఆసక్తి రేకెత్తించేదే. గొలుసు హత్యల వెనుక మిస్టరీని ఛేదించడమే ప్రధానాంశంగా కథ ఉంటుందన్నది ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతుంది. ‘రాక్షసుడ్ని, భగవంతుడ్ని చూసిన కళ్లు -ఇక ఈ ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతాయి’ అన్న వాయిస్ ఓవర్ డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ -గ్రిప్పింగ్‌గా అనిపించలేదు. రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ మూడ్‌ని డెబ్యూ డైరెక్టర్ రమణతేజ అధిగమించలేకపోయాడు. నాగశౌర్య సైతం డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌లో స్టార్ హీరో మహేష్‌ను ఇమిటేట్ చేసిన ఫీలింగే కలిగింది. ట్రైలర్‌లో హీరోయిన్ మెహ్రీన్‌కు పెద్దగా చోటులేదు. మనోజ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లర్ మూడ్‌ని క్రియేట్ చేశాయి. అశ్వథ్థామ జనవరి 31న థియేటర్లకు రానుంది.