అఖిల్.. లక్ ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలిడ్ హిట్ కోసం తన కష్టం తను పడుతూనే ఉన్నాడు హీరో అక్కినేని అఖిల్. ‘వి’ డైరెక్టర్లతో చేసిన మూడు సినిమాలూ వికటించటంతో -నాలుగో ప్రాజెక్టుకు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో టైఅప్ అవ్వడం తెలిసిందే. గత రెండేళ్లలో అటు ఎన్టీఆర్, ఇటు బన్నీకి జోడీగా టాప్ హిట్లుకొట్టిన పూజాహెగ్దె.. కొత్త ప్రాజెక్టులో అఖిల్‌తో రొమాన్స్ చేయనుంది. అఖిల్ -పూజాహెగ్దె జోడీగా రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించటం దాదాపుగా పూర్తి చేశాడు భాస్కర్. ఈ ప్రాజెక్టుతో హిట్టుకొట్టడం అఖిల్‌కు ఎంత అవసరమో, దర్శకుడు భాస్కర్‌కీ అంతే అనివార్యం. ఇప్పటికీ చెప్పుకోడానికి ‘బొమ్మరిల్లు’ ఇమేజ్ తప్ప, తెలుగులో చెప్పుకోదగ్గ మరో సినిమా భాస్కర్‌కీ పడలేదు. సో, ఇద్దరి కెరీర్‌కీ ఈ ‘ప్రేమకథ’ అత్యంత ముఖ్యం. కొద్దిరోజుల క్రితమే చివరి షెడ్యూల్‌ను దర్శకుడు భాస్కర్ పూర్తి చేసేశాడట.
అఖిల్ -పూజాహెగ్దెపై ఓ బ్యూటిఫుల్ లవ్ సాంగ్‌తోపాటు, సినిమాకు హైలెట్‌గా నిలిచే రొమాంటిక్ సీన్స్‌ని షూట్ చేశాడని తెలుస్తోంది. అఖిల్- పూజా కెమిస్ట్రీపై హైఎక్స్‌పెక్టేషన్స్‌తోవున్న చిత్రబృందం, దర్శకుడు భాస్కర్ డిజైన్ చేసిన ఫ్యామిలీ ఎమోషన్స్ సైతం మనసుకు హత్తుకుంటాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. సక్సెస్ ట్రాక్‌లో పరిగెడుతున్న పూజ -రొమాంటిక్ కెమిస్ట్రీని ఆడియన్స్‌కి కనెక్ట్ చేసి అఖిల్‌కు లిఫ్టిస్తుందో, తనదైన స్టైల్లో మరో బొమ్మరిల్లుని భాస్కర్ ఆడియన్స్‌కి చూపించి అఖిల్‌కి హిట్టిస్తాడో చూద్దాం.