రాజాకు సైఫై టెస్ట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస డిజాస్టర్లతో మార్కెట్ గ్రాఫ్ బాగా దెబ్బతిన్న టైంలో -రవితేజ నుంచి వస్తోన్న సినిమా డిస్కోరాజా. మూస సినిమాల నుంచి మాస్ రాజాను బయటకు తెచ్చేందుకు దర్శకుడు విఐ ఆనంద్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను వండి వడ్డిస్తున్నాడు. ఫస్ట్‌లుక్ నుంచి ప్రోమోల వరకూ సినిమాకు పాటిజివ్ బజ్ వినిపిస్తోంది. కంటెంట్ లేకుండా హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమాను వండలేనంటూ తెగేసి చెప్పడంలోనే దర్శకుడి స్టామినా కనిపిస్తోంది. తన టైమింగ్‌మీద విపరీతమైన నమ్మకమున్నా -వైవిధ్యం కోసం మూస కథలకు దూరంగా వున్న రవితేజ నిర్ణయమూ బావుంది. ఖర్చు కోసం వెనకాడకుండా -‘్భత, భవిష్యత్, వర్తమాన’ కాలాల కథను తెరకెక్కించడానికి నిర్మాతలు చూపించిన గట్సూ బావున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, యాక్షన్, హ్యూమర్‌లను కలిపి కాక్‌టెయిల్ కిక్కుతో వస్తున్న ‘డిస్కోరాజా’కు -టైం ఎంతవరకు కలిసొస్తుందన్నదే చిన్న సందేహం. నిజానికి అంతా అనుకున్నట్టే డిసెంబర్‌లో సినిమా వచ్చివుంటే -లెక్క వేరే ఉండేది. డిసెంబర్ రెండోవారంలో ‘వెంకీమామ’, చివరివారంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు తప్ప చించేసిన చిత్రాలేవీ రాలేదు కనుక, డిసెంబర్‌లో రవితేజ కటౌట్ బలంగా ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసి ఉండేది. కాకపోతే సినిమా అంటే పెద్ద సరంజామా కనుక -టెక్నికల్‌గా అంతా సర్దుకునే సరికి కొంత ఆలస్యమైందన్న విషయాన్ని చిత్రబృందమే అంగీకరిస్తుంది. డిస్కోరాజా రిలీజ్ డేట్‌పై సందేహాలు తలెత్తడానికి కారణం -సంక్రాంతి సినిమాల హవా. సంక్రాంతి సినిమాలు ఇప్పటికే తెలుగు ప్రేక్షకుడికి కనువిందు చేసేశాయి. సూపర్‌స్టార్ రజనీపై అభిమానంతో అనువాద చిత్రం దర్బార్ సహా, తెలుగు హిట్టు చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో సినిమాలు ఆడియన్స్ బడ్జెట్‌ని బాగానే షేర్ చేసుకున్నాయి. రెగ్యులర్ ఆడియన్స్ సినిమాకు ఎగబడినా -్ఫ్యమిలీ ఆడియన్స్ మాత్రం వెంటనే థియేటర్లకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. మాస్ సెంటర్లపై ఈ ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువుంటుంది కనుక -డిస్కోరాజా ఫలితంపై సందేహాలు లేకపోలేదు. అయితే, పూర్తి పాజిటివ్ బజ్‌తో వస్తోంది కనుక.. ‘డిస్కోరాజా’ ఎక్స్‌ట్రార్డినరీ అన్న టాక్ వస్తే మాత్రం -ప్రతిబంధకాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయినట్టే. సినిమా ఎక్స్‌ట్రార్డినరీ అనిపించుకుంటే తప్ప -రవితేజ టైమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను చూడ్డానికి ఆడియన్స్ థియేటర్లవైపు కదలకపోవచ్చు.