రక్షకుడై వస్తాడట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో నాని తాజాగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాని గత చిత్రాలకన్నా భిన్నంగా రూపొందించాలని దర్శకుడు స్క్రిప్ట్‌ను వైవిధ్యంగా రాసుకున్నారు అని యూనిట్ చెబుతుంది. ఇందులో నాని నెగెటివ్ షెడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తున్నాడట. పూర్తి వయలెన్స్ మూవీగా యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందించే ఈ చిత్రంలో మరొక హీరో సుధీర్‌బాబు కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. నాని నెగెటివ్ షెడ్స్‌లో ఉన్న పాత్రలో కనిపిస్తే, సుధీర్‌బాబు పాజిటివ్ పాత్రలో మెప్పించనున్నాడట. రాక్షసుడుగా పెరిగినవాడొకడొస్తాడు. వాడే ఇప్పుడొస్తున్నాడు. రక్షకుడు కూడా వస్తున్నాడు అన్న ఫస్ట్‌లుక్ ఈనెల 26న విడుదల కానున్నదని హీరో సుధీర్‌బాబు తెలిపారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అతిథిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. శరవేగంగా నిర్మించి, ఈ సంవత్సరం మార్చి 25న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నాని, సుధీర్‌బాబు ప్రధాన హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో నెగెటివ్ షెడ్స్‌తో ఉండడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇద్దరి కాంబినేషన్‌లో మోహన్‌కృష్ణ ఇంద్రగంటి ఎటువంటి మ్యాజిక్ చేయనున్నాడో త్వరలో తెలుస్తుంది.