జాను.. ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో హిట్టుకొట్టిన 96కు తెలుగు రీమేక్ -జాను. కంటెంట్‌లో వైవిధ్యం ఒకఎత్తయితే, లీడ్‌రోల్స్‌ను శర్వానంద్, సమంతా చేస్తుండటం -తెలుగు ఆడియన్స్‌లో అమితాశక్తి కలిగిస్తోంది. సో, సినిమా ఎప్పుడొస్తుందా? అన్న ఆసక్తి క్లాసిక్స్‌ను ఇష్టపడే ఆడియన్స్‌లో లేకపోలేదు. షూటింగ్ దాదాపు కొలిక్కి రావడంతో -గత కొద్ది రోజులుగా చిత్రబృందం సైతం పోస్టర్లు, సింగిల్స్‌తో ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే -గోవింద్ వసంత బాణీలో రూపుదిద్దుకున్న ‘ప్రాణం’ లిరికల్ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తమిళంలో విజయ్ సేతుపతి పాత్రను శర్వానంద్, త్రిష పోషించిన పాత్రను సమంతా చేస్తుండటం తెలిసిందే. సూపర్ క్లాసిక్‌గా తమిళ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేమ్‌కుమారే తెలుగు రీమేక్‌నూ తెరకెక్కించాడు. వరుస సక్సెస్‌లతో మంచి ఊపుమీదున్న దిల్‌రాజు -వైవిధ్యమైన కథ కథానాలపట్ల పూర్తి నమ్మకంతో కనిపిస్తున్నాడు. ఈ సినిమా తమ కెరీర్‌లో ప్రత్యేక స్థానం ఉంటుందంటూ అటు సమంతా, ఇటు శర్వానంద్ ప్రకటిస్తుండటం -మరింత ఆసక్తి కలిగిస్తోంది.