హ్యూమాకే చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాట అజిత్ క్రేజ్ తక్కువేం కాదు. వరుస సక్సెస్‌లతో టాప్ స్టార్ క్రేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అజిత్ నుంచి రెడీ అవుతోన్న తాజా ప్రాజెక్టు -వాలిమై. హెచ్ వినోద్ దర్శకుడు. బోనీకపూర్ నిర్మాత. రెండు నెలలు క్రితమే మొదలైన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇంతవరకూ ఈ ప్రాజెక్టులో అజిత్‌కు జోడీని ఫిక్స్ చేయలేదు. తదుపరి షెడ్యూల్స్‌లో కథానాయిక కాంబినేషన్స్ సీన్స్ తెరకెక్కించాల్సి ఉండటంతో -హీరోయిన్‌ని ఎంపిక చేసే పనిలో దర్శక, నిర్మాతల ఉన్నారట. హీరో నెగెటివ్ షేడ్స్‌వున్న పోలీస్ ఆఫీసర్‌గా.. థ్రిల్లర్ కానె్సప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం నిజానికి ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. పింక్ రీమేక్‌కు ముందు అజిత్‌తో భారీ బడ్జెట్ చిత్రం చేసే ఉద్దేశంతో దర్శకుడు వినోద్ చెప్పిన కథ అని తెలుస్తోంది. అప్పట్లో ‘పింక్’ రీమేక్‌ను అజిత్ సజెస్ట్ చేయడంతో -బోనీకఫూర్ నిర్మాతగా నెర్కొండ పారవై చేశారు. సినిమాకు మంచి రిజల్ట్ రావడంతో -అజిత్, వినోద్ కాంబోలో మరో సినిమా చేస్తానంటూ బోనీకఫూర్ అప్పట్లోనే ప్రకటించారు. అలా మొదలైన సినిమా ‘వాలిమై’గా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అజిత్‌కు జోడీగా కీర్తిసురేష్, ఇలియానా, హ్యూమా ఖురేషీ, యామీగౌతమ్ పేర్లు పరిశీలనకు వచ్చాయని తెలుస్తోంది. అయితే, పాత్రపరంగా హ్యూమా ఖురేషీ అయితే బావుంటుందన్న నిర్ణయానికి దర్శక, నిర్మాతలు వచ్చారని సమాచారం. ఆమె ఓకే అంటే -అజిత్, హ్యూమా కాంబినేషన్ ఆడియన్స్‌కి కనువిందే.