ఫైటర్ మొదలెట్టేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ పోతినేనిని ‘ఇస్మార్ట్’గా చూపించిన దర్శకుడు పూరి, ఇప్పుడు రౌడీ సెనే్సషన్ విజయ్ దేవరకొండను ‘ఫైటర్’గా చూపించటానికి రెడీ అయ్యాడు. హిందీతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్టుకు సోమవారం ముంబయిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హీరో విజయ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చార్మీ కౌర్ క్లాప్‌నిచ్చారు. బాలీవుడ్ నిర్మాతలు కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి పూరి జగన్నాథ్ చార్మీకౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ పూరికి ఇది 37వ సినిమా అయితే, విజయ్ దేవరకొండకు పదో సినిమా. ఇటు పూరి, అటు విజయ్‌కి యూత్, మాస్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌వున్న నేపథ్యంలో ఇద్దరి కాంబో ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. పూరి సైతం ఈ చిత్రాన్ని బాలీవుడ్ లెవెల్లో నిర్మించే ఆలోచనలతోనే ఉన్నాడు. అందుకే -శ్రీదేవి కుమార్తె జాన్విని ప్రాజెక్టులోకి తీసుకునే ప్రయత్నాలు చేశాడు. వర్కౌట్ కాకపోవడంతో -తాజాగా బాలీవుడ్ నటి అనన్య పాండేను ఓకే చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ప్రకటించలేదు. చిత్రం రెగ్యులర్ షూట్‌ను ఒకటి రెండు రోజుల్లోనే ముంబైలో మొదలుపెట్టనున్నట్టు సమాచారం. మరోపక్క విజయ్ సైతం ‘ఫైటర్’ ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తోంది. రియలిస్టిక్ అప్పీల్ కోసం ఇప్పటికే థాయిలాండ్‌లో కొద్దిరోజుల పాటు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటిదాకా తాను చేసిన పాత్రల్లో మోస్ట్ చాలెంజింగ్ రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ, ఈ సినిమాలో పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తాడట. రమ్యకృష్ణ, రోహిత్‌రాయ్, విష్ణురెడ్డి, అలీ, ఇతర కీలక పాత్రలు పోషించనున్న చిత్రం పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్‌పై తెరకెక్కనుంది.