లైఫ్‌లో చూసిన పాత్రే డిస్కోరాజాలో చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేసే సినిమా డిస్కోరాజా అంటున్నాడు హీరో రవితేజ. షూటింగ్ ఎంజాయ్ చేస్తూ సినిమాను చేశామని, దర్శకుడు విఐ ఆనంద్ అద్భుతంగా తెరకెక్కించాడన్నారు. రవితేజ, విఐ ఆనంద్ కాంబోలో నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించిన సినిమా -డిస్కోరాజా. నభానటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్లు. వెనె్నల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న చిత్రానికి సంగీతం తమన్ సమకూర్చాడు. జనవరి 24న సినిమా థియేటర్లకు వస్తున్న సందర్భంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ -బాబీ సింహా, వెనె్నల కిషోర్, సునీల్‌తో బెస్ట్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కలిగిందని, ముగ్గురు హీరోయిన్లు ఆడియన్స్‌ని పూర్తిగా ఎంటర్‌టైన్ చేస్తారన్నాడు. తాను చూస్తూ పెరిగిన పాత్రలే సినిమాలో చేశానంటూనే, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాకు ప్లస్ పాయింట్లు అన్నాడు. దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ -బిగ్ స్టార్‌తో చేస్తున్న నా తొలి సినిమా ఇది. నా సినిమాలను ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న రవితేజకు థాంక్స్. ప్రతి డైరెక్టర్ ఒక్క సినిమా అయినా రవితేజతో చేయాలి. ఆయననుంచి చాలా నేర్చుకోవచ్చు. కెమెరా, ఆర్ట్, మ్యూజిక్ ఇలా అన్నీ మంచిగా కుదిరాయి. ఆర్టిస్టులంతా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆడియన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌తో పూర్తిగా ఎంటర్‌టైన్ చేసే సినిమా డిస్కోరాజా అన్నాడు. సునీల్ మాట్లాడుతూ -చాలకాలం తరువాత మంచి సినిమా చేశా. డిస్కోరాజా వైవిధ్యమైన అనుభూతినివ్వడం ఖాయం. సినిమాలో అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్ అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ -రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను మర్చిపోలేను. రవితేజతో మళ్లీ సినిమా చేయాలని ఎదురు చూస్తున్నా. మంచి కానె్సప్ట్‌తో వస్తున్న సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నాడు. దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ -డిస్కోరాజా అన్న టైటిలే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రవితేజ ఎనర్జీతో ఎవ్వరూ మ్యాచ్‌కాలేరు. సినిమా హిట్టై దర్శకుడికి పేరు, నిర్మాతకు లాభాలు తేవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. హీరోయిన్ నభానటేష్ మాట్లాడుతూ -రవితేజ ఎనర్జీ సినిమాకు పెద్ద అస్సెట్. ఆయనతో నటించటం మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. విఐ ఆనంద్ క్రియేటివిటీని ఈ సినిమాలో చూస్తారు. జనవరి 24న సినిమా విడుదల కోసం నేనూ ఎదురు చూస్తున్నా అన్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ -డిస్కోరాజా టైటిల్‌తోనే సక్సెస్ కొట్టినట్టుంది. సినిమాలో విజువల్స్ బావున్నాయి. పెద్ద హిట్టవ్వాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.