సెట్స్‌పైకి పవన్ ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరించి ఊరించి మొత్తానికి పవన్ ఎంటరైపోయాడు. ఫ్యాన్స్‌ని అలరించేందుకు కెమెరా ముందుకు వచ్చేశాడు. పవర్ స్టార్ రీఎంట్రీగా చెప్పుకునే రీమేక్ సినిమా షూటింగ్ సోమవారం మొదలైంది. హైదారాబాద్‌లో మొదలైన పింక్ రీమేక్ ఫస్ట్ షెడ్యూల్‌లోనే పవన్ జాయినయ్యాడు. ప్రత్యేకంగా వేసిన కోర్టు సెట్‌లో పవన్‌పై సీన్స్‌ని షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ పది రోజులపాటు సాగుతుందని తెలుస్తోంది. దిల్‌రాజు నిర్మిస్తోన్న రీమేక్‌కు వేణుశ్రీరామ్ దర్శకుడు. హిందీలో అమితాబ్, తమిళంలో అజిత్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ పోషిస్తున్నాడు. తాప్సి పోషించిన పాత్రలో నివేదా థామస్ కనిపిస్తే, అనన్య, అంజలి కీలక పాత్రలు చేస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న చిత్రం సమ్మర్‌లో రానుందట.