నిజ్జంగా బాలయ్యే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్ది నెలల క్రితం -రూలర్ చిత్రం కోసం మేకోవర్ లుక్‌ని రిలీజ్ చేసి షాకిచ్చాడు బాలయ్య. ఐరన్‌మ్యాన్ స్టైల్లో యంగ్ హీరో పోశ్చర్‌తో కనిపించిన బాలయ్యను చూసి ముచ్చటపడటమే కాదు, ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు ‘బా.బో’ (బాలయ్య, బోయపాటి) ప్రాజెక్టు కోసం మరో మేకోవర్ లుక్‌తో మళ్లీ షాకిచ్చాడు బాలకృష్ణ. అయితే ఇది సినిమా కోసమా? రియల్ లుక్‌గా కంటిన్యూ చేస్తారా? అన్నది చూడాలి. అనూహ్యరీతిలో బాలయ్య అప్పియరెన్స్ చూసి ‘పర్ఫెక్ట్. లుక్‌కి తగిన క్యారెక్టర్ పడితే -సినిమా సెనే్సషనే’ అంటున్నారు సోషల్ మీడియా జనం. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో, విగ్గులేకుండా నల్లమీసం తెల్లగడ్డంతో ఇచ్చిన బాలయ్య అప్పియరెన్స్‌కు సినీజనం విస్మయానికి గురయ్యారు. కొత్త ‘అవతార్’ వెనుక ఆంతర్యమేమిటన్న చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. బోయపాటి డైరెక్షన్‌లో బాలయ్య మూవీ చేయనుండటం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకుని త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో బాలయ్య కొత్త అవతార్‌లో కనిపించటం సినిమా కోసమే? అన్న చర్చా మొదలైంది. ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ తీసుకోడానికి లుక్‌ను బయటకు వదిలారన్న మాట వినిపిస్తోంది. నిజానికి -పాత్రకు తగిన మేకోవర్ కోసం బాలకృష్ణ చేయని ప్రయోగమంటూ లేదు. కాకపోతే, ఇలా గుండు గీయించుకున్న సందర్భం ఇంతకుముందెప్పుడూ లేదు. సుల్తాన్, ఎన్టీఆర్ బయోపిక్, రూలర్ వంటి చిత్రాల్లో గెటప్పుల విషయంలో బాలకృష్ణ ప్రయోగాలు చేసినా -ఈ రియల్ ఓల్డ్ అండ్ బాల్డ్ లుక్‌లో కనిపించటం ఇదే ఫస్ట్‌టైం. బాలయ్య కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో సెనే్సషన్ అవుతున్నాయి.