సుక్కూ.. సెంటిమెంట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా వెనుక సెంటిమెంట్ బలమైన పాత్ర పోషించటం చూస్తూనే ఉంటాం. ఒక సినిమా సక్సెస్ అయితే, అందులోని కొన్ని అంశాలను తరువాతి ప్రాజెక్టులోనూ కంటిన్యూ చేయడానికి నిర్మాతలు, దర్శకులు సెంటిమెంట్‌గా ఫీలవుతుంటారు. ఇది ఇప్పటిదే కాదు. దర్శకుడు కె విశ్వనాథ్‌కు ‘ఎస్’తో సినిమా టైటిల్ పెట్టాలన్న సెంటిమెంట్ కంటిన్యూ చేసేవారు. త్రివిక్రమ్‌లాంటి దర్శకుడూ ఇటీవలి కాలంలో సినిమా టైటిల్స్‌కు ‘అ’ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు సుకుమార్ సైతం అలాంటి సెంటిమెంట్‌ను ఫీలవుతున్నాడా? అన్న కథనాలు వినిపిస్తున్నాయి. రంగస్థలంతో ఊహించనిస్థాయి హిట్టందుకున్న సుకుమార్, కొన్ని అంశాలను తాజాగా బన్నీతో చేస్తున్న ప్రాజెక్టులో కంటిన్యూ చేస్తున్నట్టు కనిపిస్తోంది. రంగస్థలం హిట్టు కావడంతో అదే సౌండ్ వచ్చేలా బన్నీ ప్రాజెక్టుకు ‘శేషాచలం’ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంగా సాగే కథ కావడంతో ఈ టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే, రంగస్థలం మాదిరిగానే దీన్నీ పీరియాడిక్ ఫిల్మ్‌గా తెరకెక్కిస్తూ గ్రామీణ నేపథ్యాన్ని కథలో కంటిన్యూ చేస్తున్నాడన్న కథనాలూ లేకపోలేదు. పైగా ఈ కథలోనూ థ్రిల్లర్ లక్షణాలు ఉండటం, బన్నీ లుక్‌ను సైతం రంగస్థలంలోని రామ్‌చరణ్ లుక్‌కు దగ్గరగా తెచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. మరీముఖ్యంగా రంగస్థలంలో ‘రంగమ్మత్త’గా గమ్మతె్తైన పాత్ర పోషించి ఆకట్టుకున్న అనసూయకూ తాజా ప్రాజెక్టులో ప్రాధాన్యత కలిగిన పాత్ర ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్స్ ముఠా నాయకురాలిగా అనసూయను చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలికలన్నీ యాధృచ్చికమే అయినా -కథనాలు మాత్రం ‘సెంటిమెంట్’గా ఎత్తి చూపుతుండటం గమనార్హం. దీనిపై దర్శకుడు సుక్కూ ఏమంటాడో చూడాలి. ఈ సినిమా వచ్చే దసరాకు విడుదయ్యే అవకాశాలు ఉన్నాయి.