ప్రభా ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎట్టకేలకు ప్రభాస్ ఓ అప్‌డేట్ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్టిల్‌ను షేర్ చేశాడు. లేటెస్ట్ మూవీ షూట్‌ని త్వరలో మొదలు పెడుతున్నట్టు పేర్కొంటూ -షెడ్యూల్ చాలా ఫన్ రైడ్‌లా ఉంటుందంటూ డిస్క్రిప్షన్ పెట్టాడు. విలాసవంతమైన వింటేజ్ భవంతిలోని ఓ పియానో ఫోకస్‌లో గోడలపైవున్న ఫొటోగ్రాఫ్స్‌ని ఆసక్తిగా చూస్తున్న ప్రభాస్ లుక్ ఇంట్రెస్టింగా ఉంది. జాన్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ప్రభాస్ తాజా చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. పునర్జన్మలతో ముడిపడిన 1960లనాటి ప్రేమకథగా తెరకెక్కుతోన్న చిత్రంలో తొలిసారి ప్రభాస్‌తో పూజా హెగ్దె జోడీ కడుతోంది. సాహో చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేషన్స్ ఈ సినిమానూ నిర్మిస్తోంది. కథ రీత్యా చాలాభాగం యూరోప్‌లో చిత్రీకరించాల్సి ఉండగా, చాలావరకూ సెట్స్‌వేసి చిత్రీకరిస్తున్నారు.