చిరుతో చరణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ చాలా బిజీగా ఉన్నాడు. ఒకపక్క భారీ ప్రాజెక్టులు చేస్తూ, మరోపక్క భారీ ప్రాజెక్టులు తెరకెక్కిస్తూ తీరికలేకుండా ఉన్నాడు. అలాంటి టైంలోనూ సొంత బ్యానర్‌పై తండ్రి చిరంజీవితో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్న ప్రాజెక్టు కోసం ఫార్టీ డేస్ కేటాయించాడట. వినోదం.. సందేశం కలగలిసిన కథలో చిరంజీవి సరికొత్త లుక్‌తో ఎంట్రీ ఇవ్వనుండటం ఆసక్తికరం. చిరుతో త్రిష జోడీ కడుతోంది. సినిమాలో ప్రత్యేక పాత్రలో చరణ్ కనిపించనున్నాడంటూ వస్తోన్న కథనాలను నిజం చేస్తూ -చరణ్ 40 రోజుల షెడ్యూల్‌ను సినిమాకు కేటాయించాడన్నది కొత్త టాక్. యవ్వన దశలోని చిరుగా రామ్‌చరణ్ కనిపిస్తాడట. తెరపై పాత్ర నిడివి ఎంతో తెలీదుగానీ, ఈ పాత్రతో కొరటాల పెద్ద ప్రయోగమే చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. రాజవౌళి ‘ట్రిపుల్ ఆర్’ ప్రాజెక్టు కొలిక్కి రావడంతో -త్వరలోనే కొరటాల సెట్స్‌పైకి చరణ్ వస్తాడన్న మాట వినిపిస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది.