ఐటీ పోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతికి భారీ సక్సెస్‌తోపాటు, అంతే షాక్ తగిలింది యంగ్ సెనే్సషన్ రష్మిక మండన్నకు. కెరీర్ ఆరంభమైన షార్ట్‌టైంలోనే యంగ్ సెనే్సషన్‌గా ఎదిగిన రష్మిక, మహేష్‌తో చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో యంగ్ జనరేషన్‌లో టాప్ హీరోయిన్ అనిపించుకుంది కూడా. హిట్టు సినిమాల సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న రష్మికకు -సంక్రాంతి మరుసటి రోజే భారీ షాక్ తగలడంపై పెద్ద చర్చే నడుస్తోంది. కర్నాటకలోని ఆమె నివాసంపై జరుగుతోన్న ఐటి దాడులు సంచలనంగా మారింది. కొడుగు జిల్లా విరాజ్ పేటలోని ఆమె నివాసంలో ఐటి అధికారులు పెద్దఎత్తున తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం తెల్లవారుఝామున మొదలైన సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. పన్ను సరిగా కట్టడం లేదన్న ఫిర్యాదుల మేరకు ఐటీ సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్న రష్మిక, సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన బయలు దేరినట్టు చెబుతున్నారు. మరో నెలలో రష్మిక నటించిన భీష్మ చిత్రం సైతం విడుదలకానుంది. వరుస సినిమాలతో బిజీగావున్న రష్మికకు ఐటీ సోదాలు కొత్త చికాకులే అన్న మాట వినిపిస్తోంది. రష్మిక సన్నిహితులు మాత్రం సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ రొటీనేనంటూ కొట్టిపారేస్తున్నారట.