రొమాంటిక్ జాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి ముగిసింది. పండగ సినిమాల హడావుడీ సద్దుమణిగింది. పండగను టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమాలన్నీ ఆడియన్స్ దగ్గర ఓకే అనిపించుకుని, కలెక్షన్ల టార్గెట్ల కోసం పరుగులు తీస్తున్నాయి. హడావుడి తగ్గిన తరువాత అప్‌డేట్స్ ఇద్దామంటూ ఆగిన రాబోయే చిత్రాలూ -జనాల్లో ఆసక్తి రేకెత్తించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. మెజారిటీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అలాంటి చిత్రాల్లో ‘జాన్’ ఒకటి. పునర్జన్మల నేపథ్యంగా సాగే రొమాంటిక్ లవ్ స్టోరీ కంటెంట్‌తో రానున్న చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి, సాహోలాంటి పాన్ ఇండియా సినిమాల తరువాత -ప్రేమికుడి అప్పియరెన్స్‌లో ప్రభాస్ కనిపించనున్న చిత్రమిది. వరుస హిట్లుతో టాప్ హీరోయిన్ రేంజ్‌కి చేరిన పూజాహెగ్దె హీరోయిన్. యువీ క్రియేషన్స్‌తో కలిసి కృష్ణంరాజు నిర్మిస్తోన్న సినిమానుంచి చాలాకాలంగా ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు. షూటింగ్ ఎంతవరకూ పూరె్తైంది? ముఖ్యపాత్రల్లో కనిపించేదెవరు? సినిమా విశేషాలు.. లాంటి అంశాలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృత చూపిస్తున్నారు. దీంతో, పెద్ద చిత్రాల సంక్రాంతి హడావుడి తగ్గడంతో -జాన్‌కు సంబంధించి కొన్ని అప్‌డేట్స్ ఇచ్చేందుకు చిత్రబృందం రంగం సిద్ధం చేసింది. శుక్రవారం సినిమా అప్‌డేట్స్ ఇస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించింది. సినిమాపై పూర్తి క్లారిటీనిచ్చే అప్‌డేట్స్ రావొచ్చన్న టాక్ ఫిల్మ్‌నగర్లో వినిపిస్తోంది.