సబ్ ఫీచర్

పిల్లల్ని గమనిస్తున్నారా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ పిల్లల బాగోగులే తల్లిదండ్రులకు అన్నింటికన్నా ముఖ్యం. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అనునిత్యం తపన పడుతుంటారు. చిన్నారులను బాగా చదివించి, వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. సమాజంలో వారు ఉన్నత స్థానంలో నిలబడాలని శక్తికి మించి శ్రమపడుతూ పేరెంట్స్ తమ సుఖాలను సైతం వదులుకుంటారు. పిల్లలు ఎప్పుడు ఏం అడిగినా కాదనకుండా అమర్చి పెడతారు. వారికి అన్ని విధాలా స్వేచ్ఛ ఇస్తారు. కానీ, తాము కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు అంతగా అనుకోరు.

చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు ఇతరుల ముందు చిన్నబుచ్చుకోకూడదని వారేం అడిగినా ఇవ్వడానికి వెనుకాడరు. ఖరీదైన బహుమతులు, స్నేహితులకు ఖర్చుపెట్టడానికి డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు చెడు సావాసాలకు లోనయ్యే ప్రమాదం వుంది. ఈ విషయం తల్లిదండ్రులు తెలుసుకునేలోపు పరిస్థితి చేయి దాటిపోవచ్చు.
ఇటీవలి కాలంలో కొందరు తల్లిదండ్రులు ఇతరుల ముందు తమ పిల్లల స్టేటస్ తగ్గకూడదని వారికి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్లు ఇచ్చేస్తున్నారు. వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా అంతగా పట్టించుకోవడం లేదు. కంప్యూటర్‌తో పిల్లలు ఏం చేస్తున్నారో, ఇంటర్నెట్‌లో వారు ఏం చూస్తున్నారో తెలుసుకునేంత ఓపిక, తీరిక తల్లిదండ్రులకు ఉండదు. మంచి కంటే చెడు వేగంగా వ్యాపిస్తుంది. పిల్లలు ఇంటర్నెట్‌కు అలవాటుపడితే కొన్నిసార్లు విపరిణామాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ‘ఊరంతా తెలిసిన తర్వాత గానీ మనకి తెలియదన్న’ట్లు పిల్లలు చెడు సావాసాల బాట పట్టిన తర్వాత గానీ పేరెంట్స్‌కు అసలు విషయం తెలియదు. అందుకే పిల్లల ప్రవర్తన మీద ఒక కనే్నసి ఉంచాలి. వారి అలవాట్లు, వారు తిరుగుతున్న ప్రదేశాలు, వారి స్నేహితుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ‘ఏమీ కాదులే’ అని ఉదాసీనంగా వ్యవహరిస్తే వారు చేయి దాటిపోయే ప్రమాదం వుంది. వయసుకు మించిన వ్యవహారాలు చేయడం, చిన్నాపెద్దా లేకుండా పిల్లలు మాట్లాడడాన్ని చాలామంది తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటారు. తమ పిల్లలు చాలా తెలివైన వాళ్లని భ్రమపడతారు. పెద్దలతో ఎలా మెలగాలో చిన్నారులకు నేర్పాలి. మంచీ మర్యాదా, మన్నన అబ్బేట్లు చేయాలి. చదువుకునే వయసులో పుస్తకాలపైనే దృష్టి నిలపాలని వారికి మంచిమాటలు చెబుతూ అవగాహన కల్పించాలి. తరగతులు ముగిసినా ఇంటికి ఆలస్యంగా రావడం, ప్రైవేటు క్లాసులని, స్నేహితులతో పని ఉండి వెళ్లానని పిల్లలు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకూడదు. వారు చెప్పేది ఎంతవరకు నిజమో స్వయంగా తెలుసుకోవాలి. తరచూ ఇంట్లో నుండి అధిక మొత్తంలో పిల్లలు డబ్బు తీసుకెళుతుంటే- వారు దేనికి ఖర్చు చేస్తున్నారో ఆరా తీయాలి. డబ్బు, కాలం విలువ గురించి వారికి చెబుతుండాలి. పిల్లలను అనుక్షణం గమనిస్తూ వారిని మంచి దారిలో నడిచేలా తీర్చిదిద్దాలి. నిఘా పెట్టినట్లు కాకుండా తగిన జాగ్రత్తలతో ఇవన్నీ చేయాలి. స్నేహంగానే మెలుగుతూనే వారిని తీర్చిదిద్దడం తమ బాధ్యత అని పేరెంట్స్ గుర్తించాలి.

-బాబు