వశిష్టిపుత్రగా మోక్షజ్ఞ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. అఖండ భారతాన్ని పరిపాలించిన తొలి తెలుగు రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కథతో తెరకెక్కే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రం ద్వారా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇందులో మోక్షజ్ఞ పాత్ర శాతకర్ణి తనయుడు వశిష్టిపుత్ర పాత్రలో కనిపిస్తాడు. దాంతోపాటు ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో కూడా పనిచేస్తాడని సమాచారం. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కే ఈ చిత్రం మొరాకోలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. తెలుగు ప్రజలందరికీ చిరకాలం గుర్తుండే తరహాలో తెరకెక్కించే ఈ చిత్రంతో తన వారసుణ్ణి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాడు బాలకృష్ణ. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.