మహేష్ సరసన దీపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న గ్లామర్ భామ దీపికా పదుకొనె త్వరలోనే తెలుగు సినిమాల్లో నటించేందుకు రంగం సిద్ధమైంది. మహేష్‌బాబు సరసన ఆమె హీరోయిన్‌గా నటిస్తుందంటూ వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటిస్తున్న మహేష్‌బాబు తన తదుపరి చిత్రానికి రెడీ అయ్యాడు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం మురుగదాస్ సోనాక్షి సిన్హాతో ‘అకీరా’ చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తికావచ్చింది. ఇప్పటికే మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్‌వర్క్ కూడా పూర్తయిందట. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం అనే్వషణ జరుగుతోంది. ఇప్పటికే కీర్తి సురేష్, పరిణీతి చోప్రాల పేర్లు విన్పించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొనె నటించేందుకు ఓకె చెప్పినట్టు తెలిసింది. దక్షిణాదికి చెందిన దీపిక బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఇప్పటికే రజనీకాంత్ సరసన ‘కొచ్చాడయాన్’ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీపికా నటించే మొదటి తెలుగు చిత్రం ఇదే.