అమెరికన్ నటుడితో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపుతెచ్చుకున్న శ్రుతిహాసన్ ‘శ్రీమంతుడు’ సినిమా తరువాత దక్షిణాదిపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలనే రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో ‘ప్రేమమ్’ సినిమాలో మాత్రమే నటిస్తున్న ఈమె, తాజాగా కమల్ హీరోగా నటిస్తున్న ‘శభాష్ నాయుడు’ చిత్రంలో నటిస్తోంది. తండ్రీ కూతుళ్ళు కలిసి అవే పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌కు జోడీగా అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్ అమెరికన్ నటుడు మనూ నారాయణ్ నటించనున్నాడు. మనూ నారాయణ్ గతంలో ‘బాంబే డ్రీమ్స్’, ‘లవ్ గురు’ వంటి చిత్రాల్లో నటించాడు. ఈ చిత్రంలో కమల్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లాస్‌ఎంజెల్స్‌లో జరగనుందట. టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నా కూడా శ్రుతిహాసన్ ఇలా చిన్న నటుడి సరసన నటించడం ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.